AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits: పండ్లు మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమైనవి.. కానీ ఈ నాలుగు జాగ్రత్తలను పాటించకపోతే వాటితో ప్రయోజనం లేనట్లే..

తక్కువ కేలరీలు అధిక ఫైబర్ ఉన్నందున మానవ ఆరోగ్యానికి పండ్లు చాలా శ్రేయస్కరమైనవి. అంతేకాక మనం బరువు తగ్గడంలో ఇవి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఇంకా చెప్పుకోవాలంటే మన శరీరానికి కావలిసిన విటమిన్లు.. ఇంకా..

Fruits: పండ్లు మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమైనవి.. కానీ ఈ నాలుగు జాగ్రత్తలను పాటించకపోతే వాటితో ప్రయోజనం లేనట్లే..
Eating Fruits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 6:18 PM

Share

తక్కువ కేలరీలు అధిక ఫైబర్ ఉన్నందున మానవ ఆరోగ్యానికి పండ్లు చాలా శ్రేయస్కరమైనవి. అంతేకాక మనం బరువు తగ్గడంలో ఇవి అద్భుతంగా ఉపకరిస్తాయి. ఇంకా చెప్పుకోవాలంటే మన శరీరానికి కావలిసిన విటమిన్లు, పోషక పదార్థాలు, ఖనిజాలు పండ్లలో పుష్కలంగా ఉంటాయి. పండ్లు అత్యంత సహజమైన ఆహారం మాత్రమే కాదు, శరీరం ఆరోగ్యవంతంగా పనిచేయడానికి అవసరమైన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లను కూడా కలిగి ఉంటాయి. పండ్లలో ఎన్ని పోషక విలువలు, విటమిన్లు ఉన్నప్పటికీ మనం అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ప్రయోజనరహితం. ఎందుకంటే అవసరమైన జాగ్రత్తలను పాటించకపోతే పండ్లలోని కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను తప్పకుండా కోల్పోతాము. వాటి నుంచి మనం ఆరోగ్య ప్రయోజనాలను ఎక్కువగా పొందడానికి సరిగ్గా తినడం చాలా ముఖ్యం. అలాగే పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే..

  1. పండ్ల కలయికలు: ఇతర ఆహార పదార్థాల కంటే పండ్లు వేగంగా జీర్ణమవుతాయి. కానీ పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడు శరీరంలో ‘అమా’ అనే టాక్సిన్స్ ఏర్పడటానికి కారణమవుతుంది. అనేక రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఎక్కువ బరువున్న ఆహారం జీర్ణం కావడానికి పట్టినంత మాత్రమే పండ్లను తినాలి. లేకపోతే పోషకాల శోషణ కష్టమవుతుంది. ఇది సాధారణంగా విషపూరితమైనది, అనారోగ్యం, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితిని పెంచుతుంది. పండ్లను విడిగా తినడమే శ్రేయస్కరం.
  2. రాత్రిపూట పండ్లు తినడం: నిద్రవేళకు 2-3 గంటల ముందు ఏదైనా తినడాన్ని నివారించడం మంచిది. ఎందుకంటే అలా తినడం జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఇది పండ్లకు కూడా వర్తిస్తుంది. పడుకునే ముందు పండ్లను తినడం వల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే పండ్లలోని  ఉన్న చాలా చక్కెర శరీరంలోకి విడుదల చేస్తుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు శక్తి స్థాయిలను పెంచుతుంది. రాత్రి సమయంలో, పోషకాలను గ్రహించే, సమీకరించే మన సామర్థ్యం శరీరానికి గణనీయంగా తగ్గుతుంది. అదనంగా, రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఎసిడిటీ లక్షణాలు కలగవచ్చు. పండ్లను సాయంత్రం స్నాక్‌గా తీసుకోవాలి. అంతేకాని దాని కంటే తరువాత తీసుకోకూడదు.
  3. వెంటనే నీరు త్రాగడం: పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పండ్లు తిన్న తర్వాత నేరుగా నీటిని తాగడం తరచుగా చేస్తుంటారు. పండ్లను తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ pH స్థాయి అసమతుల్యతకు లోనవుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక శాతం నీరు ఉన్న పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ నీరు ఉన్నందున మీ కడుపులోని ఆమ్లతను తగ్గించడం ద్వారా pH బ్యాలెన్స్‌ను మార్చగలదు. ఇలా చేయడం వల్ల డయేరియా లేదా కలరా వంటి తీవ్ర అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  4. పండ్ల తొక్కలను వదిలివేయడం: విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల విషయానికి వస్తే  పండ్లపై తొక్కలోనే ఎక్కువగా ఉంటాయి.  ఉదాహరణకు.. ఆపిల్ పీల్స్‌లో ఫైబర్, విటమిన్ సీ, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. పలు పరిశోధనల ప్రకారం.. పండ్ల తొక్కలను తినడం వల్ల మీ ఊబకాయం,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ..