AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla With Honey: పరగడుపున ఉసిరిని ఈ విధంగా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే లొట్టలేస్తారంతే..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పోషక విలువలున్న ఆహారాన్ని తినడం తప్పనిసరి. ఈ పోషక విలువలు మాంసం, పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే తెనే, ఉసిరిలో కూడా సరపడినంతగా.. ఇంకా..

Amla With Honey: పరగడుపున ఉసిరిని ఈ విధంగా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే లొట్టలేస్తారంతే..
Amla With Honey
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 7:47 PM

Share

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పోషక విలువలున్న ఆహారాన్ని తినడం తప్పనిసరి. ఈ పోషక విలువలు మాంసం, పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. అలాగే తెనే, ఉసిరిలో కూడా సరపడినంతగా పోషక విలువలు ఉంటాయి. ఉసిరి, తేనెలలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు సమృద్దిగా ఉన్నాయి. ఇక ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల లివర్‌ హెల్తీగా ఉండడమే కాక శరీరానికి జాండిస్‌ రాకుండా నివారిస్తుంది. శరీరంలో భాగాలలో, ముఖ్యంగా కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్, టాక్సిన్స్‌ను ఇవి తొలగిస్తాయి. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేయగలుగుతుంది.

అంతేకాక తేనెలో నానబెట్టిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. ఇది ఆకలిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం, పైల్స్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి తెనే ఉసిరి వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. తేనెలో నానిన ఉసిరిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనపడతారు.

కాగా ఇందుకోసం ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెను పోసి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. ఆ తర్వాత మూత బిగించి పక్కకు పెట్టాలి.  కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా విరివిగానే లభిస్తున్నాయి. కాబట్టి తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను వెంటనే తిని ఈ ప్రయోజనాలను పొందండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..