Indian Racing League: రేసింగ్ లీగ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా రామ్‌చరణ్‌ – ఉపాసన దంపతులు.. సందడి చేసిన నాగచైతన్య

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. రెండు రోజులు ప్రాక్టీసు సెషన్లు జరగ్గా, నిన్న మెయిన్ రేసులు నిర్వహించారు.

Indian Racing League: రేసింగ్ లీగ్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు.. సందడి చేసిన నాగచైతన్య
Naga Chaitanya Ram Charan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2022 | 7:04 AM

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. రెండు రోజులు ప్రాక్టీసు సెషన్లు జరగ్గా, నిన్న మెయిన్ రేసులు నిర్వహించారు. కార్ రేసింగ్ పోటీలను తిలకించేందుకు మెగా హీరో రామ్ చరణ్ సతీసమేతంగా విచ్చేశారు. రామ్ చరణ్, ఉపాసన రేసింగ్ పోటీలను ఉత్సాహంగా తిలకించారు. ఓ రేస్ కారు పక్కన నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు.

రామ్‌ చరణ్‌కి స్వతహాగా రేసింగ్స్‌ అంటే మక్కువ ఎక్కువ. గతంలో రామ్‌చరణ్‌ హార్స్‌ రేసింగ్స్‌లో కనిపించారు. ఇప్పుడు సాగర తీరంలోనూ సందడి చేశారు. యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను ఆస్వాదించారు.

ఇవి కూడా చదవండి

హుస్సేన్ సాగర్ తీరంలో 2.7 కిమీ మేర ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ట్రాక్ పొడవునా వివిధ ప్రాంతాల్లో వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

కాగా, ఓవరాల్ చాంపియన్ గా కొచ్చి టీమ్ నిలిచింది. కొచ్చి మొత్తం 417.5 పాయింట్లు సొంతం చేసుకుని చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ 385 పాయింట్లతో సెకండ్ ప్లేస్ సొంతం చేసుకుంది. ఆఖరి ఫీచర్ రేసులో మాత్రం చెన్నై జట్టు నెగ్గింది.

మరిన్ని టాలీవుడ్ వార్తల కోసం..