AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కింటి మహిళతో తండ్రి ఎఫైర్‌.. ఆ పనిలో ఉండగా.. కొడుకు చూశాడని దారుణం..

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసిన 15 ఏళ్ల కుమారుడ్ని దారుణంగా చంపాడు. చేతులు నరికి చిత్ర హింసలకు గురిచేశాడు. ఆ తర్వాత గొంతునులిమి దారుణంగా చంపాడు.

పక్కింటి మహిళతో తండ్రి ఎఫైర్‌.. ఆ పనిలో ఉండగా.. కొడుకు చూశాడని దారుణం..
Affair
Shaik Madar Saheb
|

Updated on: Dec 11, 2022 | 5:34 PM

Share

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసిన 15 ఏళ్ల కుమారుడ్ని దారుణంగా చంపాడు. చేతులు నరికి చిత్ర హింసలకు గురిచేశాడు. ఆ తర్వాత గొంతునులిమి దారుణంగా చంపాడు. చేతులను బావిలో.. మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరోథా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగార్డ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, బంధువైన 35 ఏళ్ల మహిళతో కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఆ మహిళతో తండ్రి సన్నిహితంగా ఉండటాన్ని 15 ఏళ్ల కుమారుడు చూశాడు. భయపడిన తండ్రి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతాడేమోనని అనుమానించాడు. అనంతరం కొడుకును ఇంట్లోకి పిలిచి దారుణంగా హత్య చేశాడు. మొదట ఆ వ్యక్తి కుమారుడి చేతులు నరికాడు. అనంతరం నరికిన చేతులను 400 అడుగుల లోతైన బావిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడిని గొంతునులిమి హత్య చేసి సమీపంలోని పొలంలో మృతదేహాన్ని పడేశాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం చేతులు తెగి ఉన్న బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతునులిమి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో.. పోలీసులు బాలుడి తండ్రిని ప్రశ్నించారు. కుమారుడు అదృశ్యమైనప్పటికీ ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ప్రశ్నించారు. ఈ సమయంలో అతని మాటలపై సందేహం రావడంతో.. తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరకు కొడుకును తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

నిందితుడి సమాచారంతో హత్యకు వినియోగించిన తాడు, కొడవలి, నరికిన చేతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, అతడి ప్రియురాలిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు దేవాస్ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..