Standing vs Sitting: నిలబడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా..? ఆ సమస్యలు రమ్మన్నా రావు..
సాధారణంగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఆహారం తినడం ద్వారా మన శరీరానికి పలు పోషకాలు లభిస్తాయి. అలాగే సంగీతం వినడం ద్వారా
సాధారణంగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఆహారం తినడం ద్వారా మన శరీరానికి పలు పోషకాలు లభిస్తాయి. అలాగే సంగీతం వినడం ద్వారా మనస్సు ఆహ్లాదకరంగా మారి రిలాక్స్ అవుతుంది. కానీ, నిలబడటం వల్ల కూడా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మీరు ఎప్పుడైనా విన్నారా..? బహుశా మీలో చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. వాస్తవానికి నిలబడటం కూడా ఒక రకమైన వ్యాయామమే.. ఇది మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే మన జీవనశైలిని మార్చుకోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
మన ప్రస్తుత జీవనశైలి 24 గంటలలో 8 నుంచి 9 గంటల వరకు కూర్చునే విధంగా మారింది. కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దీని వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
రోజంతా ఒకే చోట కూర్చున్నప్పుడు లేదా శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, బరువు లాంటివి నిలబడి పని చేయడం లేదా నిలబడటం ద్వారా నియంత్రణలో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా, గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.
కొవ్వు కరిగిపోతుంది..
మనం నిలబడి ఉన్నప్పుడు, మన జీవక్రియ రేటు సరిగ్గా ఉంటుంది. దీని వల్ల మన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. మరోవైపు, కూర్చోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. దీని కారణంగా కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. ఫలితంగా ఊబకాయం పెరుగుతుంది.
ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది..
కూర్చోవడం కంటే నిలబడి ఉన్నప్పుడే శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో కండరాలు పని చేస్తూనే ఉంటాయి. ఒక విధంగా నిలబడి ఉండటం వ్యాయామమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
వెన్నునొప్పి తగ్గుతుంది..
చాలా గంటలు ఒకే భంగిమలో కూర్చొని పని చేస్తే, తరచుగా వెన్నునొప్పి వస్తుంది. నిలబడి పని చేయడం వల్ల, మన కండరాలు చురుగ్గా మారతాయి. దీని కారణంగా వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..