AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drink Water: పాలు తాగిన తర్వాత నీళ్లు తాగుతున్నారా.. పెద్ద పొరపాటు చేస్తున్నట్లే.. ఎందుకు తాగొద్దంటారో తెలుసా..

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదని మన పెద్దలు చాలాసార్లు చెబుతుంటారు. కానీ దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా..? నిజానికి ఇలా చేయడం వల్ల..

Drink Water: పాలు తాగిన తర్వాత నీళ్లు తాగుతున్నారా.. పెద్ద పొరపాటు చేస్తున్నట్లే.. ఎందుకు తాగొద్దంటారో తెలుసా..
Drink Water
Sanjay Kasula
|

Updated on: Dec 11, 2022 | 8:48 AM

Share

భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం వల్ల కలిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అయితే భోజనంతోపాటు ఇతర ఆహార పదార్థాలను కూడా తిన్న తర్వాత అస్సలు నీళ్లు తాగొద్దని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదని మన పెద్దలు చాలాసార్లు చెబుతుంటారు. కానీ దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా..? నిజానికి ఇలా చేయడం వల్ల జీర్ణ రసాలు పలచబడతాయి. జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడుతాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగాలని, అలాగే చల్లటి నీటిని అస్సలు తాగొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. తిన్న వెంటనే నీటిని తీసుకుంటే.. అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఆ ఆహార పానీయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని ఆహారాలుతో నీటి కలయిక మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నారింజ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ ఆ తర్వాత త్రాగే నీరు pH బ్యాలెన్స్‌ను పాడు చేస్తుంది. దీని కారణంగా పండ్ల జీర్ణక్రియలో సమస్యలు మొదలవుతాయి.

సిట్రస్ పండ్లతోపాటు.. అంటే పుల్లని పండ్లతోపాటు అరటి పండు తిన్న తర్వాత కూడా నీటిని తాగొద్దని సూచిస్తున్నారు. ప్రతి సీజన్‌లో లభించే పండు అంటే అరటి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఈ పండు తిన్న వెంటనే నీరు త్రాగొద్దు. లేకపోతే జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఏర్పడుతాయి. మీరు కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. ఆ తర్వాతే నీళ్లను తాగండి.

అరటి తర్వాత మరో పండు. ఇంది ప్రతి చలికాలం ముగుస్తుండగా మొదలై.. వేసవి కాలంలో భారీ ఎత్తున లభిస్తుంది. పుచ్చకాయ వేసవిలో 90 శాతం కంటే ఎక్కువ నీరు కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. తిన్న వెంటనే నీటిని తీసుకుంటే.. జీర్ణ రసాలు పలచబడి.. ఉబ్బరం కలిగిస్తుంది.

ఇక మనం నిత్యం తాగే పాలు.. పాలు మన శరీరానికి పోషణనిచ్చే సంపూర్ణ ఆహారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాలు తాగిన తర్వాత నీటిని తాగితే ప్రొటీన్ల మెటబాలిజం మందగిస్తుంది. అలాంటి అసిడిటీ, అజీర్తి సమస్య వస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం