Kisan Credit Card: రైతులకు వరం కిసాన్ క్రెడిట్ కార్డ్‌.. ఇలా చేస్తే అతి తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం..

కేంద్రంలో మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు, ఆర్థిక సాయం అందించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది.

Kisan Credit Card: రైతులకు వరం కిసాన్ క్రెడిట్ కార్డ్‌.. ఇలా చేస్తే అతి తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం..
Kisan Credit Card
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2022 | 6:17 PM

కేంద్రంలో మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు, ఆర్థిక సాయం అందించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ పథకం ఒకటి. ఈ కార్డు ద్వారా రైతులు అతి తక్కువ వడ్డీకి రుణాన్ని పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాలలోని రైతులు అవసరమైన వ్యవసాయ రుణాన్ని పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. వ్యవసాయ నిర్వహణ ఖర్చులతోపాటు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్డును బ్యాంకులన్నీ జారీ చేస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా.. గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఇవే కాకుండా బీమా సదుపాయం కూడా ఉంటుంది. శాశ్వత వైకల్యం లేదా మరణిస్తే రూ. 50,000 వరకు కుటుంబానికి అందుతుంది. ఇతర ప్రమాదాలలో రూ.25000 వరకు బీమా సదుపాయం ఉంటుంది. రూ.1.60 లక్షల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు.

మీరు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్‌ కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఏదైనా బ్యాంకులో దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. KCC ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్ పత్రాలు అవసరం.. లాంటి మొదలైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకోండి.. కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కిసాన్ క్రెడిట్ కార్డ్ – అర్హత..

ఏ రైతు అయినా కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అతని వద్ద పొలం పత్రాలు ఉండాలి. దీనితో పాటు కౌలు రైతులు, మౌఖిక కౌలుదారులు, వాటాదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలంటే రైతులు వయస్సు 18 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఏ పత్రాలు అవసరం

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం.. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడి ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి కార్డ్ / పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైనవి, రెసిడెన్షియల్ ప్రూఫ్, బ్యాంక్ నుంచి దరఖాస్తు ఫారమ్, రెవెన్యూ అథారిటీ ద్వారా ధృవీకరించబడిన భూమి సర్టిఫికేట్, పంట వివరాలు, రుణాల వివరాలు, సెక్యూరిటీ డాక్యుమెంట్లు మొదలైనవి అవసరం.

ఎలా దరఖాస్తు చేయాలంటే..?

మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. SBI వెబ్‌సైట్ ప్రకారం.. ప్రాసెసింగ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఈ కార్డుపై రైతులకు దాని స్థిర వడ్డీ రేటుకు రుణం ఇస్తుంది. రూ.50,000 వరకు KCC రుణాలకు ప్రాసెసింగ్ ఛార్జీ ఉండదు. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే 3 నుంచి 4 శాతం మేరకు వడ్డీ రాయితీ ఇస్తారు. కిసాన్ కార్డు కోసం.. బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం మూడు నాలుగు పని దినాలలో అర్హత ప్రకారం.. బ్యాంకు సిబ్బంది సంప్రదించి అప్డేట్ ఇస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..