AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: స్టార్ హీరో కావాలని వచ్చి.. ఆ ఒక్క కారణంతో డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి.. ఎందుకో తెలుసా ?..

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ 2022కి ముఖ్య అతిథిగా హాజరయిన రిషబ్ ఆల్ ఇండియా సితార..కాంతార అనే సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే తాను హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Rishab Shetty: స్టార్ హీరో కావాలని వచ్చి.. ఆ ఒక్క కారణంతో డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి.. ఎందుకో తెలుసా ?..
Rishab Shetty
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2022 | 11:13 AM

Share

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా.. డైరెక్టర్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడు నటుడు రిషబ్ శెట్టి. ఆయన స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా సెప్టెంబర్ 30న కర్ణాటక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు..తమిళం, మలయాళం, హిందీలో డ బ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. అన్ని భాషల్లోనూ ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కర్ణాటక ఆదివాసీల సంప్రదాయం.. భూతకోల ఆచారాన్ని ఈ సినిమాతో ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు రిషబ్ శెట్టి. అంతేకాదు.. ఈ మూవీలో రిషబ్ నటనకు ప్రతి ప్రేక్షకుడు ముగ్దులయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ లోని 20 నిమిషాల రిషబ్ నటన గూస్ బంప్స్ తెప్పించడమే కాకుండా.. ఈ చిత్రంలోని ఓ.. శబ్దం ఆడియన్స్‏కు ఆడిక్ట్ అయిపోయారు. అయితే దర్శకత్వంలోనే కాదు.. నటుడిగానూ ప్రశంసలు అందుకున్న రిషబ్.. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోజులను గుర్తుచేసుకున్నారు.

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ 2022కి ముఖ్య అతిథిగా హాజరయిన రిషబ్ ఆల్ ఇండియా సితార..కాంతార అనే సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే తాను హీరో అవ్వాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. రిషబ్ మాట్లాడుతూ.. “నేను నటుడు కావాలని చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. నాకు బ్యాగ్రౌండ్ లేకపోవడం.. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఎవరూ నాకు అవకాశం ఇవ్వరు అని అనుకున్నాను. సినీ ఇండస్ట్రీలో ఉండేందుకు నా దగ్గర డబ్బులు లేవు. అనేక ఇంటర్వ్యూలు చదివేవాడిని. ఒక సూపర్ స్టార్ తన ఇంటర్వ్యూలో తనకు ఎవరు నటించే అవకాశం ఇవ్వకపోవడంతో తాను అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా అయ్యారో చెప్పారు. ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా మారాడు. మనలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి రావడానికి ఇదే మంచి మార్గం అనుకున్నాను. ఆ మార్గాన్ని అనుసరించేందుకు నేను డైరెక్షన్ లో డిప్లొమా చేశాను.

అటు సినిమాలు తెరకెక్కిస్తున్నా.. నటించాలనే ఆలోచన మాత్రం నాలో ఉండేది. కన్నడ పరిశ్రమలోకి 2004 లో సైనైడ్ అనే సినిమాకు నాకు చివరి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. కానీ ఆ పని చేస్తుంటే నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. నా మనస్సులో చాలా కథలు ఉండేవి. ఆ తర్వాత ఆరేళ్లపాటు నటుడిగా చేయాలని ప్రయత్నించాను. కానీ నటుడిగా కానీ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా గానీ అవకాశాలు రాలేదు. దాంతో నటనకు ఇక ఛాన్స్ రాదని డైరెక్షన్ పై దృష్టి పెట్టాను. రక్షిత్ శెట్టికి ఓ కథ చెప్పాను. అది ఆయనకు నచ్చడంతో ఆయన హీరోగా .. నేను దర్శకుడిగా మారాను. ఇక ఆ తర్వాత నటన వదిలేశాను. 3 సినిమాలు రూపొంచిందిన తర్వాత బెల్ బాటమ్స్ సినిమా వచ్చింది. 2019 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటన, దర్శకత్వం రెండూ చేయవచ్చు అనుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.