- Telugu News Photo Gallery Cinema photos Pan India Star Prabhas and actor Gopichand in Balakrishna's Unstoppable with NBK 2 Photos Goes Viral telugu cinema news
Prabhas: బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి అన్‍స్టాపబుల్ వేదికపై ప్రభాస్ రచ్చ రచ్చ.. సరికొత్త లుక్‌లో డార్లింగ్..
ఎప్పుడెప్పుడా అని డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు హీరో గోపిచంద్‌తో కలిసి అన్‍స్టాపబుల్ వేదికపై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఆహా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది.
Updated on: Dec 12, 2022 | 1:05 PM

ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు హీరో గోపిచంద్‌తో కలిసి అన్‍స్టాపబుల్ వేదికపై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఆహా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‍స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేదికపై ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఇటీవల మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యతో కలిసి చేసిన అల్లరి తెలిసిందే. తాజాగా ఈ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి పాల్గొన్నారు.

డిసెంబర్ 11న వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగగా..ఈరోజు ప్రభాస్ , గోపిచంద్ ఫోటోస్ రిలీజ్ చేసింది ఆహా. అందులో డార్లింగ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

అంతే కాకుండా చిరునవ్వుతో ఎంతో సరదాగా కనిపిస్తున్నారు ప్రభాస్. అలాగే బాలయ్యతో కలిసి గోపిచంద్, ప్రభాస్ అన్ స్టాపబుల్ వేదికపై రచ్చ రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్, గోపిచంద్ కు సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇటీవల మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యతో కలిసి చేసిన అల్లరి తెలిసిందే. తాజాగా ఈ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి పాల్గొన్నారు.





























