AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యులకు పిడుగులాంటి వార్త.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. వామ్మో.. మరీ ఇంతలా..

దేశవ్యాప్తంగా కోడిగ్రుడ్ల ధరలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే ఈ నెలలో ఎగ్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ ధరలు కూడా ఇలాగే పెరుగుతున్నాయి. ఒక్కొ గుడ్డు ధర ప్రస్తుతం రూ.9కి చేరుకుంది. ఎల్‌నివో వల్ దాణా ఖర్చులు పెరగడం కారణం.

సామాన్యులకు పిడుగులాంటి వార్త.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. వామ్మో.. మరీ ఇంతలా..
Eggs Price
Venkatrao Lella
|

Updated on: Nov 15, 2026 | 9:24 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బియ్యం, వంటనూనె, షుగర్, కూరగాయల లాంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగ్గా.. ఇప్పుడు సామాన్యుడికి ఎప్పుడూ అందుబాటులో ఉండే కోడిగుడ్డు ధరలు కూడా అమాంతం పెరుగదలను నమోదు చేస్తున్నాయి. రోజురోజుకు గుడ్ల ధరలు పెరుగుతున్నాయి.  దాదాపు మూడు నెలల పాటు నిలకడగా ఉన్న గుడ్ల ధరలు.. గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. హోల్ సేల్ మార్కెట్‌లో డజను గుడ్ల ధర గతంలో రూ.80 ఉండగా, నాలుగు ఐదు రోజుల క్రితం రూ.90కి చేరింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.96కి చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే డజన్‌పై ఏకంగా రూ.16 మేర ధర పెరగడంతో సామాన్యులపై ధరల భారం పడుతోంది. రాబోయే రోజుల్లో డజన్ గుడ్ల ధరలు సెంచరీని కొట్టే అవకాశముంది. ఎల్‌నివో ప్రభావం వల్ల దాణా ఖర్చులు, మొక్కజోన్న ధరలు పెరగడంతో పాల్ట్రీ వ్యాపారులకు ఖర్చు పెరుగుతుంది. ఇది నేరుగా వినియోగదారులపై ప్రభావతం చూపిస్తున్నాయి. హోల్సేల్ ధరలకు అనుగుణంగా రీటైల్ మార్కెట్‌లోనూ ధరలు ఒక్కసారిగా గత కొద్దిరోజులుగా పుంజుకుంటున్నాయి.

భారీగా పెరిగిన గ్రుడ్ల ధరలు..

గతంలో చిల్లర దుకాణాల్లో ఆరు నుంచి ఏడు రూపాయల మధ్య పలికిన ఒక్కో కోడిగుడ్డు ధర.. ప్రస్తుతం రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. ఆగస్టు మొదటి వారంలో తగ్గిన గుడ్ల ధర డజను రూ.80 వద్దే వారం క్రితం వరకు స్థిరంగా కొనసాగింది. అయితే గత కొద్ది రోజులుగా డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వంటి మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు ఊహించని విధంగా పెరిగాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సూచించిన హోల్సేల్ ధరల ప్రకారం.. నవంబర్ 13 నాటికి హైదరాబాద్‌లో 100 గుడ్ల ధర రూ.640గా ఉండగా.. విశాఖపట్నంలో రూ.625 వద్ద కొనసాగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రధాన పోషకాహార వనరులుగా ఉండే కోడిగుడ్ల ధరలు కూడా పెరగడం షాక్ ఇస్తోంది. కార్తీక మాసం రావడంతో చాలామంది నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో పెద్దగా డిమాండ్ లేకున్నా గుడ్ల రేట్లు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్‌లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.86గా కొనసాగుతోంది. విజయవాడలో రూ.80గా ఉంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్సులు ఉన్నట్లు పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నివో ప్రభావం, ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరగడం దీనికి కారణంగా చెబుతున్నారు.

Follow Us