AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్లల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు.. జస్ట్ ఐడీ కార్డ్ చూపిస్తే చాలు.. ఎన్నిసార్లు అయినా..

రైల్వేశాఖ విద్యార్థులకు అద్బుత అవకాశం కల్పిస్తోంది. అదేంటంటే.. రైళ్లల్లో ఫ్రీ జర్నీ చేయవచ్చు. డిగ్రీ వరకు విద్యార్థులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ ప్రత్యేక సదుపాయం అందిస్తోంది. ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలంటే ఒక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐడీ కార్డు చూపించి టికెట్ పొందాలి.

Indian Railways: రైళ్లల్లో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు.. జస్ట్ ఐడీ కార్డ్ చూపిస్తే చాలు.. ఎన్నిసార్లు అయినా..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Nov 15, 2026 | 7:45 PM

Share

దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. దేశంలోని దాదాపు చాలా ప్రాంతాలకు రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంది. రైళ్లల్లో తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటంతో.. ఎక్కువమంది ట్రైన్ జర్నీని ఇష్టపడుతుంటారు. అయితే రైళ్లల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటికి గురించి తెలియక చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నాయి. పలు వర్గాలవారు ఉచితంగా ట్రైన్ జర్నీ చేయవచ్చు. మరికొంతమందికి రైలు టికెట్లపై భారీగా రాయితీ పొందవచ్చు. ఈ సదుపాయాలు ఉపయోగించడం వల్ల రైలు ప్రయాణం మరింత చౌకగా మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు రైళ్లల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. ఇందుకోసం రైల్వేశాఖ ప్రత్యేక నెలవారీ పాస్ కూడా ప్రవేశపెట్టింది.

ఈ రైళ్లల్లో విద్యార్థులకు ఫ్రీ జర్నీ

విద్యార్థులు ప్యాసింజర్, ఆర్డినరీ రైళ్లల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాయ్స్ అయితే ఇంటర్ వరకు, అమ్మాయిలు అయితే డిగ్రీ వరకు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. ఇంటికి, కాలేజీకి మధ్య 150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. సెకండ్ క్లాసులో మాత్రమే ప్రయాణించడానికి వీలుండగా.. ఏసీ, స్లీపర్ లాంటి మిగతా కోచ్‌లలో అనుమతి ఉండదు. ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలంటే మంత్లీ సీజన్ టికెట్ విద్యార్థులు పొందాల్సి ఉంటుంది. ఈ టికెట్ నెలపాటు చెల్లుబాటు అవుతుంది. బస్సు పాస్‌ల తరహాలో విద్యార్థులకు రైల్వేశాఖ ఈ మంత్లీ పాస్‌లు అందిస్తోంది. ఈ పాస్ తీసుకుని కాలేజీ, స్కూల్ నుంచి మీ ఇంటికి వెళ్లే దారిలో ఉండే స్టేషన్ల మధ్య ఉచితంగా జర్నీ చేయొచ్చు.

పాస్ ఎలా తీసుకోవాలి..?

మీ స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకుని రైల్వే కౌంటర్ల వద్దకు వెళ్లాలి. అక్కడ ఉండే టికెట్ సిబ్బందికి వాటిని అందించి మంత్లీ సీజన్ టికెట్ ఇవ్వాలని అడగాలి. దీంతో సిబ్బంది మీ వివరాలను ధృవీకరించుకుని మంత్లీ పాస్ జారీ చేస్తారు. ఈ టికెట్ ద్వారా రైళ్లల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుంటుంది. మీ స్కూల్ లేదా కాలేజ్ నుంచి మీ ఇంటికి వెళ్లే స్టేషన్ల మధ్య మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో రాయితీ

-విద్యార్థులు విద్యా పర్యటనలకు వెళ్లే సమయంలో టికెట్లపై రాయితీ పొందవచ్చు

– జనరల్ కేటగిరీ విద్యార్థులు సెకండ్, స్లీపర్ క్లాసులో 50 శాతం వరకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సెకండ్, స్లీపర్ క్లాసులో 75 శాతం వరకు టికెట్లపై సబ్సిడీ పొందవచ్చు

-గ్రామీణ ప్రాంతాల్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు విద్యా పర్యటనల కోసం ఏడాదికి ఒకసారి సెకండ్ క్లాస్ టికెట్లపై 75 శాతం పొందోచ్చు

-గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ బాలికలు జాతీయ స్థాయి వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం వెళ్లేటప్పుడు సెకండ్ క్లాస్‌లో 75 శాతం రాయితీ సౌకర్యం ఉంటుంది

-యూపీఎస్సీ, స్టాప్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సెకండ్ క్లాసు టికెట్లపై 50 శాతం రాయితీ ఉంటుంది

-35 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న రీసెర్చ్ విద్యార్థులు పరిశోధన పని నిమిత్తం చేసే ప్రయాణాలకు సెకండ్, స్లీపర్ క్లాసులో 50 శాతం రాయితీ ఉంది.

Follow Us
 సోంబేరీ చికెన్.. బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే రెసిపీ
 సోంబేరీ చికెన్.. బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే రెసిపీ
రైళ్లలో విద్యార్థులకు ఫ్రీ జర్నీ.. ఐడీ కార్డ్ ఉంటే చాలు..
రైళ్లలో విద్యార్థులకు ఫ్రీ జర్నీ.. ఐడీ కార్డ్ ఉంటే చాలు..
అప్పట్లో జయసుధ ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారా?
అప్పట్లో జయసుధ ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారా?
గొర్రె మాంసం, మేక మాంసం.. వామ్మో ఇన్ని తేడాలున్నాయా?
గొర్రె మాంసం, మేక మాంసం.. వామ్మో ఇన్ని తేడాలున్నాయా?
ఊరు ఒకటే.. పంచాయతీలే రెండు.. ఎన్నికలొస్తే
ఊరు ఒకటే.. పంచాయతీలే రెండు.. ఎన్నికలొస్తే
హైదరాబాద్‌ రోడ్డుపై భారీ కొండచిలువ.. చూసిన వాహనదారులకు షాక్!..
హైదరాబాద్‌ రోడ్డుపై భారీ కొండచిలువ.. చూసిన వాహనదారులకు షాక్!..
ఇంట్లో ఇడ్లీ పిండి లేదా?.. 10 నిమిషాల్లో రవ్వతో ఇడ్లీలు చేసేయండి
ఇంట్లో ఇడ్లీ పిండి లేదా?.. 10 నిమిషాల్లో రవ్వతో ఇడ్లీలు చేసేయండి
సాయంత్రం టీతో పాటు తినడానికి అదిరిపోయే స్నాక్.. పాలక్ పనీర్ పకోడ
సాయంత్రం టీతో పాటు తినడానికి అదిరిపోయే స్నాక్.. పాలక్ పనీర్ పకోడ
'రామాయణ్‌'లో యశ్.. రావణుడిని ఇంత అందంగా తీర్చిదిద్దింది ఈమెనే
'రామాయణ్‌'లో యశ్.. రావణుడిని ఇంత అందంగా తీర్చిదిద్దింది ఈమెనే
అర్ష్‌దీప్‌కు అలా చేయాలంటే వణుకంట.. అందుకే ఆట పట్టిస్తారట
అర్ష్‌దీప్‌కు అలా చేయాలంటే వణుకంట.. అందుకే ఆట పట్టిస్తారట