Watch: హైదరాబాద్ రోడ్డుపై భారీ కొండచిలువ.. చూసిన వాహనదారులకు షాక్! చివరికి ఏం జరిగిందంటే?
Hyderabad Python on Busy Road: హైదరాబాద్‌లోని జల్‌పల్లి కార్గో రోడ్డుపై శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం రహదారుల కూడలిలో భారీ కొండచిలువ కలకలం రేపింది. రద్దీగా ఉండే మార్గంలో పామును చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. పోలీసులు, అటవీ శాఖ, స్నేక్ రెస్క్యూయర్‌ల సమన్వయంతో కొండచిలువను సురక్షితంగా పట్టుకొని, శంషాబాద్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది నాన్-పాయిజనస్ రాక్ పైథాన్‌గా గుర్తించారు.

Hyderabad Python on Busy Road: ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారి.. మరోవైపు శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గం.. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది భారీ అజగర్. హైదరాబాద్‌లోని జల్‌పల్లి కార్గో రోడ్డు సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో అజగర్ కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు దానిని చూసి భయంతో పరుగులు తీయగా, మరికొందరు వాహనాలను ఆపి దూరంగా వెళ్లిపోయారు.
ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఒకవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారి ఉండగా, మరోవైపు శ్రీశైలం వైపు వెళ్లే కీలక మార్గం ఉంది. ఇలాంటి రద్దీ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, అటవీ శాఖ అధికారుల సహకారంతో స్నేక్ రెస్క్యూయర్ మల్లేష్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఎలాంటి హాని కలగకుండా కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రెస్క్యూ చేసిన ఈ కొండచిలువ విషపూరితం కాని రాక్ పైథాన్‌గా గుర్తించారు. దీనిని శంషాబాద్ అటవీ ప్రాంతంలోని సహజ ఆవాసంలో విడిచిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఒక్కసారిగా భారీ అజగర్ ప్రత్యక్షం కావడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సకాలంలో స్పందించిన పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి స్థానికులు అభినందనలు తెలిపారు.
వీడియో చూడండి..
