AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamta Mohandas : ఇండస్ట్రీలో ఆ హీరోనే నా బెస్ట్ ఫ్రెండ్.. ఒకరోజు ఫోన్ చేసి ఏం మాట్లాడంటే

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నటిగా , గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 3:29 PM

Share
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. వ్యక్తిగత జీవితంలో క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన మమత.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

1 / 5
జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని మమతా మోహన్‌దాస్ తెలిపారు. ఆయనలో ఉండే ఉత్సాహం, సానుకూల దృక్పథం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్‌ను కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా చూస్తానని వెల్లడించారు. తన వ్యక్తిగత విషయాలను సైతం ఆయనతో స్వేచ్ఛగా పంచుకోగలనని పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య స్నేహం బలపడటానికి సంగీతం కూడా ఒక ముఖ్యమైన కారణమని మమత తెలిపారు. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమని, ఆ అభిరుచే తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని చెప్పారు.

2 / 5
ఎన్నేళ్లు గడిచినా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటికీ ఎదురుపడినప్పుడు 'యో! వాట్స్ అప్' అంటూ ఎంతో సరదాగా పలకరించుకుంటామని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ మమత ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో ఒకరోజు తారక్ నుంచి అనుకోకుండా ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. ఎందుకు ఫోన్ చేశారని అడిగితే.. ప్రత్యేకంగా ఏమీ లేదని, సరదాగా కాల్ చేశానని ఎన్టీఆర్ చెప్పినట్లు వెల్లడించారు.

3 / 5
ఆయనలోని ఆ సహజత్వం, సింప్లిసిటీ తనకు ఎంతో నచ్చుతాయని మమత వివరించారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తనకు సినిమా రంగంపై పెద్దగా అవగాహన ఉండేది కాదని మమత తెలిపారు. అందరితో ఎక్కువగా కలిసిపోయే స్వభావం కూడా తనకు లేదని చెప్పారు. అయితే ఆ సమయంలో తనకు మంచి స్నేహితులుగా మారిన వారిలో జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు ముఖ్యమైనవారని వెల్లడించారు. వారిద్దరితోనూ ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడగలనని, వ్యక్తిగత విషయాల నుంచి ఇతర అంశాల వరకు స్వేచ్ఛగా చర్చించగలనని తెలిపారు.

4 / 5
ఎన్టీఆర్, జగపతి బాబులలో తనకు నచ్చేది వారి వ్యక్తిత్వమని మమత పేర్కొన్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీలో ఎంతోమంది పరిచయమైనప్పటికీ, కొద్దిమందితో మాత్రమే ఇలాంటి అనుబంధం ఏర్పడుతుందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి మమతా మోహన్‌దాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. స్టార్ హీరోగా ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ మాత్రమే కాకుండా, స్నేహితుడిగా ఆయనలోని మంచితనాన్ని కూడా ఈ సందర్భంగా మమత బయటపెట్టారు.

5 / 5
Follow Us