AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips: రోటీన్‌ పద్దతులకు గుడ్‌బై.. ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!

చాలా మంది ఇళ్లలో ఉండే ప్రధాన సమస్యల్లో బాత్‌రూమ్‌ టైల్స్‌ నల్లగా మారడం కూడా ఒకటి. ఈ ఒక్క బాత్‌రూమ్‌ మురికిగా కనిపిస్తే పూర్తి ఇళ్లు అందం చెడిపోతుంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడూ క్లీన్ ఉంచుకోవాలి. అయితే బాత్‌రూమ్‌ క్లీన్ చేసేందుకు చాలా మంది రకరకాల రసాయనాలు వాడుతుంటారు. కానీ అందులో ఉన్న మురికి మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో దొరికే వస్తువులతోనే బాత్‌రూమ్ టైల్స్‌ను కొత్తవాటిలా ఎలా మార్చాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Nov 15, 2026 | 4:21 PM

Share
మన ఇల్లు అందంగా, పరిశుభ్రంగా కనబడాలంటే.. కేవలం హాల్, కిచెన్‌ మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు.. బాత్రూమ్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బాత్రూమ్‌లోని టైల్స్‌పై పేరుకుపోయే సబ్బు మరకలు, తేమ, మొండి మురికి కారణంగా అవి త్వరగా నల్లగా మారిపోతాయి. ఎన్ని సార్లు శుభ్రం చేసినా వాటిపై ఉన్న మురికి అలాగే ఉంటుంది. వీటిని క్లీన్ చేసేందుకు ఖరీదైన క్లీనర్‌తో పనిలేకుండా.. ఇంట్లో దొరికే వస్తువులతోనే వాటని కొత్త వాటిలా మార్చొచ్చు.

1 / 5
బాత్‌ టైల్స్‌ను శుభ్రం చేయడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. దాదాపు ఈ వస్తువులన్న మీ ఇంట్లోనే దొరుకుతాయి. ఇందుకోసం  3 టీస్పూన్ల వాషింగ్ పౌడర్, 1 ప్యాకెట్ ఈనో,  కొద్దిగా హార్పిక్ టాయిలెట్ క్లీనర్,  , ఒక గిన్నె,  ఒక లాండ్రీ బ్రష్ , ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటే సరిపోతుంది. వీటి సహాయంతోనే ఈజీగా మీరు బాత్‌రూట్ టైల్స్‌పై ఉన్న మొండి మరకలను తొలగించవచ్చు.

2 / 5
ఇందుకోసం మీరు ఒక పేస్ట్‌ను రెడీ చేసుకోవాలి. ముందుగా, ఒక గిన్నెలో 3 టీస్పూన్ల వాషింగ్ పౌడర్ వేయండి. తర్వాత అందులో ఒక ప్యాకెట్ ఈనో వేసి బాగా కలపండి. తర్వాత, కొద్దిగా హార్పిక్ టాయిలెట్ క్లీనర్ వేసి అన్నింటినీ మరోసారి బాతా కలపండి. ఈ క్రమంలో ఈ మిశ్రమం నురుగు రావడం మొదలవుతుంది, అంతే మీ క్లనర్ రెడీ అయినట్టే. ఇది ఎంతటి మురికినైనా క్షణాల్లో వదిలిస్తోంది.

3 / 5
ఈ ద్రావణం రెడీ చేసుకున్న తర్వాత మీరు టైల్స్‌పై ఎక్కడైతే ఎక్కువ మురికి ఉందో, అక్కడ ఒక చెంచాతో ఈ ద్రావణాన్ని చిలకరించండి. తర్వాత, లాండ్రీ బ్రష్‌ తీసుకొని ఆ ప్రాంతంలో దాన్ని పూర్తిగా రుద్దండి. తర్వాత, పేరుకుపోయిన మురికిపై అది పనిచేసేలా కొద్దిసేపు అలాగే వదిలేయండి. తర్వాత, బ్రష్‌తో టైల్స్‌ను బాగా రుద్దండి. మరకలు మరీ మొండిగా ఉంటే మీరు స్టీల్ స్క్రబ్బర్‌ను కూడా వాడొచ్చు.

4 / 5
బాగా రుద్దిన తర్వాత.. శుభ్రమైన నీటిని తీసుకొని ఆ టైల్స్‌ను బాగా కడగండి. అంతే మురికిగా ఉన్న టైల్స్‌ కాస్తా కొత్తవాటిలా మెరిసిపోతాయి. అయితే మీ బాత్‌రూమ్‌ ఎప్పుడూ ఇలానే శుభ్రంగా ఉండాలంటే వారిని రెండు సార్లు కచ్చితంగా క్లీన్ చేయండి.. అలాగే బాత్‌రూమ్‌లో ఎప్పుడూ తేమగా ఉండేలా కాకుండా దానిలో గాలి వచ్చే కిటికీలు తెరిచి ఉండండి.. ఎందుకంటే తడిగా ఆ తేమ కారణంగా టైల్స్ రంగు మళ్లీ మారిపోవచ్చు.

5 / 5
Follow Us