AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి

ఏదైనా పెళ్లికో, ఫంక్షన్‌కో హడావిడిగా బయలుదేరాల్సి వచ్చినప్పుడు మన ముఖం కాంతివంతంగా, తాజాగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టే సమయం, ఓపిక అందరికీ ఉండవు. పైగా ఖరీదైన గోల్డెన్ ఫేషియల్స్ చేయించుకున్నా, వాటిలోని రసాయనాల వల్ల కొన్నిసార్లు చర్మానికి హాని జరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు పైసా ఖర్చు లేకుండా, మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే వస్తువులతోనే కేవలం 15 నిమిషాల్లో అద్భుతమైన మెరుపును తెచ్చే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

Phani CH
|

Updated on: Nov 15, 2026 | 2:07 PM

Share
ఈ ఇన్‌స్టంట్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు చాలా సాధారణమైనవి. ఒక గిన్నెలో ఒకటిన్నర చెంచా పంచదార, కొద్దిగా బియ్యం పిండి, చిటికెడు కస్తూరి పసుపు లేదా వంట పసుపు, తగినన్ని పచ్చి పాలు లేదా కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకోవాలి.

1 / 5
పంచదార చర్మానికి సహజమైన స్క్రబ్‌లా పనిచేసి, మృతకణాలను తొలగిస్తుంది. బియ్యం పిండి చర్మ ఛాయను మెరుగుపరచగా, పాలు ముఖానికి మృదుత్వాన్ని, తేమను అందిస్తాయి. పసుపు చర్మ సమస్యలను దూరం చేసి తక్షణ కాంతిని ఇస్తుంది. ఒకవేళ మగవారు లేదా పసుపు పడని వారు ఈ ప్యాక్ వాడాలనుకుంటే, పసుపుకు బదులుగా శనగపిండి లేదా ముల్తానీ మిట్టి కలుపుకోవచ్చు.

2 / 5
వీటన్నింటినీ బాగా కలిపి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ప్యాక్ వేసుకునే ముందు ముఖంపై ఎలాంటి మేకప్ లేదా పౌడర్ లేకుండా సాధారణ నీటితో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు నలుపు ఎక్కువగా ఉండే మెడ భాగంలో కూడా మృదువుగా రాసుకోవాలి.

3 / 5
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తగ్గడానికి రోజ్ వాటర్‌లో ముంచిన దూది ఉండలను లేదా కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకుని, కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ప్యాక్ ఆరిన తర్వాత కొద్దికొద్దిగా చల్లటి నీటిని ముఖంపై చల్లుకుంటూ, చేతి వేళ్లతో గుండ్రంగా మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సబ్బుతో ముఖం, మెడను శుభ్రం చేసుకుంటే, ఒక్క వాష్‌లోనే ముఖంలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

4 / 5
ఎలాంటి రసాయనాలు లేని ఈ చిట్కాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటే మొటిమలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయి, మీ చర్మం ఎప్పుడూ సహజ సిద్ధమైన కాంతితో మెరిసిపోతుంది.

5 / 5
Follow Us
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి
పైసా ఖర్చు లేకుండా బంగారంలా మెరిసే అందం మీ సొంతం! ఇలా చేయండి
ఓటీటీలో అనుపమ కొత్త సినిమా.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

చలికాలంలో వచ్చే రోగాలన్నింటినీ తరిమికొట్టే కమ్మనైన ఉసిరికాయ రసం

కప్పు రవ్వతో.. పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడిగే జ్యూసీ డెజర్ట్

మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం

Video: 6,6,6,6,4,4.. 38 ఏళ్ల వయసులో ఈ దూకుడేంది సామీ..!

శరీరానికి బలాన్నిచ్చే వట్టి తునకల కూర.. లాభాలు తెలిస్తే వదలరు

చలికాలం శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే షాకవుతారు!

91 ఏళ్ల వయసులో పాస్‌పోర్ట్.. 96 ఏళ్లకు ఏడు ఖండాల యాత్ర పూర్తి!

మేం ఇప్పటికీ భార్యభర్తలమే.. కానీ.. అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ