OTT Movie: ఓటీటీలో అనుపమ కొత్త సినిమా.. ‘క్రేజీ కల్యాణం’ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
దసరా కు థియేటర్లలో రిలీజైన రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఇదే పండగకు రిలీజైన అనుపమా పరమేశ్వరన్ సినిమా 'క్రేజీ కల్యాణం' కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘క్రేజీ కల్యాణం’. దసరా పండగ కానుకగా అక్టోబర్ 16న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పెళ్లి’ అనే పాయింట్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ బద్రప్ప గాజుల. అనుపమతో పాటు నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, కిరిటీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో రిలీజైన క్రేజీ కల్యాణం మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అయితే జైలర్ 2, రణబాలి వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా బరిలోకి ఉండడంతో ఈ సినిమా చాలా మందికి రీచ్ కాలేకపోయింది. దీంతో తక్కువ రోజుల్లోనే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. యావరేజ్ రిజల్ట్ తోనే సరి పెట్టుకున్న క్రేజీ కల్యాణం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. క్రేజీ కల్యాణం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఆహా. మూడు రోజుల క్రితమే కమింగ్ సూన్ అంటూ క్రేజీ కల్యాణం పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ శుక్రవారం ( నవంబర్ 20) నుంచి క్రేజీ కల్యాణం సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ ఈ సిఇమా అందుబాటులోకి రానుంది.
యూరో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్మోహన్ రెడ్డి ‘క్రేజీ కల్యాణం’ సినిమాను నిర్మించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాల రాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవలు చేసి ఇంటి పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు పర్వతాలు. కానీ కీర్తి తనతో పాటు కాలేజీ లో చదువుకునే ఉదయ్(అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. లైఫ్ లో సెటిలైపోయిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంతలోనే కీర్తికి ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు తండ్రి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే ఈ క్రేజీ కల్యాణం సినిమా చూడాల్సిందే.
ఆహాలో అనుపమ క్రేజీ కల్యాణం
View this post on Instagram
క్రేజీ కల్యాణం సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




