AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna: మేం విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం.. అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ

ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. తన అందం, అభినయంతో తెలుగులో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పటికీ 'శివగామి వంటి పవర్ ఫుల్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు రమ్యకృష్ణ.

Ramya Krishna: మేం విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం.. అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ
Ramya Krishnan, Krishna Vamsi
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 1:14 PM

Share

రమ్యకృష్ణ.. తెలుగు జనానికి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార నేటి తరానికి కూడా శివగామిగా బాగా తెలుసు. ఇటీవలే రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ 2 సినిమాలో ఓ కీలక పాత్రలోనూ ఆకట్టుకున్నారీ అందాల తార. సినిమాలు, సీరియల్స్, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు రమ్యకృష్ణ. హీరోయిన్ గా బిజీగా ఉంటోన్న సమయంలోనే టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారీ అందాల తార. 2003 జూన్ 12న వీరి వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే కుమారుడు పుట్టాడు. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ చెన్నైలోనే ఉంటున్నారు. మరోవైపు దర్శకుడు కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటున్నారు. దీంతో రమ్యకృష్ణ- కృష్ణవంశీ విడిపోయారా? విడాకులు తీసుకున్నారా? అంటూ తరచూ రకరకాల రూమర్స్ వస్తుంటాయి. తాజాగా విషయంపై ఓపెన్ గా మాట్లాడారు రమ్యకృష్ణ. ఓ పాడ్ కాస్ట్ కు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కృష్ణవంశీతో రిలేషన్ షిప్ పై ఓపెన్ గా మాట్లాడారు రమ్యకృష్ణ.

‘మేం ఇప్పటికీ దంపతులుగానే ఉన్నాం. కానీ వేర్వేరు చోట్ల ఉంటున్నాం. అందుకు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా మా కెరీర్ కారణంగానే ఇలా వేర్వేరుగా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే నా కొడుకు పుట్టిన తర్వాత సీరియల్స్ చేస్తున్న టైంలో ప్రతి 15 రోజులకొకసారి చెన్నై వెళ్లొచ్చేదాన్ని. నేను అలా వెళ్లిన ప్రతిసారి నా కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను అబ్బాయిని చెన్నైలోనే చదివిస్తానని ఆయన (భర్త కృష్ణవంశీ)తో చెప్పాను. అయితే ఆ ప్రొసెస్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకేనేమో ఇప్పటికీ మేం దంపతులుగానే ఉన్నాం. ప్రస్తుతానికైతే రోజూ గొడవలు పడటం కంటే మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం. పెళ్లెందుకు? లివింగ్ టుగెదర్ చేద్దామని వంశీ(కృష్ణవంశీ) అప్పుడే చెప్పాడు. నేను కూడా అప్పుడే దానికి ఓకే చెప్పి ఉండాల్సింది (నవ్వుతూ). ఆయనకు సినిమానే ప్రపంచం. ఆయన నా వర్క్‌లోకి రారు.. నేను ఆయన వర్క్‌లోకి వెళ్లను. ప్రస్తుతం ఆయన, నేను ఇద్దరం సంతోషంగా ఉన్నాం’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అందాల తార కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా రమ్యకృష్ణ- కృష్ణవంశీల వైవాహిక బంధంపై రూమర్లు ఆగుతాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us