AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిండుగా జీవించలేకపోతున్నా.. నవ్వలేకపోతున్నా..! మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం

సినీ నటి గౌతమి మొన్నామధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం , ముఖ్యంగా నటుడు కమల్ హాసన్‌తో తన బంధం, ఆ బంధం ముగియడానికి దారితీసిన పరిస్థితులు, అలాగే వివాహం పై తన లోతైన అభిప్రాయాలను వెల్లడించారు .

నిండుగా జీవించలేకపోతున్నా.. నవ్వలేకపోతున్నా..! మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం
Gouthami
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 1:43 PM

Share

నటి గౌతమి, నటుడు కమల్ హాసన్ మధ్య బంధం ముగియడానికి గల కారణాలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము విడిపోవడానికి ఒక మూడో మనిషి కారణం కాదని, తమ వ్యక్తిగత ఎదుగుదల అలాగే జీవన మార్గాలు వేరుపడడమే ముఖ్య కారణమని ఆమె స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో గౌతమి ఈ విషయాలను పంచుకున్నారు. చాలా మంది శృతి హాసన్ వంటి వ్యక్తుల పేర్లను ప్రస్తావించడంపై ఆమె స్పందిస్తూ, మూడో మనిషికి ఈ రిలేషన్షిప్‌లో మనం ఎప్పుడూ బాధ్యత, అలాంటి ఒక స్టాండింగ్ మనం ఇస్తామో, ఇంపార్టెన్స్ ఇస్తామో, అది రిలేషన్ షిప్ కాదు అని అన్నారు. మనుషులు మారినప్పుడు, వారి దారులు వేరైనప్పుడు, అది ఒక బాధాకరమైన పరిస్థితి అని ఆమె వివరించారు. తమ బంధం కాలక్షేపం కోసం తీసుకున్న నిర్ణయం కాదని, తేలికగా తీసుకున్న సంబంధం కాదని గౌతమి అన్నారు. ఈ విడిపోవడం వల్ల తాను ఒక భారాన్ని మోస్తున్నానని, ఆ అన్‌హ్యాపీనెస్‌తో నిండుగా జీవించలేకపోతున్నానని ఆమె తన భావాలను వ్యక్తపరిచారు.

ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి

నిండుగా ఊపిరి పీల్చలేకపోవడం, నవ్వలేకపోవడం, ప్రపంచాన్ని చూడలేకపోవడం వంటి అనుభవాలను పంచుకుంటూ, అలా జీవించడం వల్ల ముగ్గురికి ద్రోహం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. మొదట, పూర్తి వ్యక్తిగా ఉండలేకపోవడం వల్ల తన కూతురికి తప్పుడు ఉదాహరణ అవుతుందని, సగం సగంగా బ్రతకడం, రాజీ పడటం నేర్పిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండవది, తనను తాను మోసం చేసుకుంటున్నానని, నిండుగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ తనను తానే హ్యాండిక్యాప్ చేసుకుంటున్నానని అన్నారు. ఈ కఠిన పరిస్థితులలో తన తల్లి జ్ఞాపకాలు తనకు అండగా నిలిచాయని గౌతమి తెలిపారు.

ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి

తన తల్లి తనను కష్టపడి పెంచింది తాను ఇలా రాజీ పడి, కుంగిపోయి, బాధపడటం కోసమని కాదని ఆమె గుర్తు చేసుకున్నారు. తన తల్లి జీవితానికి అర్థం రావాలంటే, తాను నిండుగా, సంతోషంగా జీవించాలని ఆమె బలంగా నమ్మారు. ఈ మూడు కారణాలు కూతురికి మంచి ఉదాహరణగా నిలవడం, తనను తాను మోసం చేసుకోకుండా ఉండటం, తల్లి జీవిత ఆశయాన్ని గౌరవించడం. తనను సరైన నిర్ణయం వైపు నడిపించాయని గౌతమి వివరించారు. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రాజీ పడాలా, కొనసాగాలా లేక వేరే మార్గాన్ని ఎంచుకోవాలా అనేది వ్యక్తిగతమని ఆమె అభిప్రాయపడ్డారు. తన విషయంలో, రాజీ పడడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తనతో తాను రాజీ పడితే ఎలా జీవిస్తానని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రయాణంలో ఎదుగుదల, ఆత్మగౌరవం, నిజాయితీ అత్యంత ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు. కమల్ హాసన్‌తో సంబంధానికి ముందు, ఆ తర్వాత తనలో చాలా ఎదుగుదల జరిగిందని, ఈ ప్రగతి తనకు ఎంతో ముఖ్యమని గౌతమి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆయన సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us