AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cyclone Update: ఏపీలో కమ్ముకొస్తున్న మరో తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణశాఖ తాజా అప్డేట్..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుఫాన్‌గా మారే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత నవంబర్ 17వ తేదీన తీవ్ర తుఫాన్‌గా మారనుందని హెచ్చరించింది. ఈ క్రమంలో రాబోయే మూడ్రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

AP Cyclone Update: ఏపీలో కమ్ముకొస్తున్న మరో తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణశాఖ తాజా అప్డేట్..
Ap Cyclone
Venkatrao Lella
|

Updated on: Nov 15, 2026 | 4:18 PM

Share

ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడచిన 3 గంటల వ్యవధిలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి, ఈ రోజు నవంబర్ 15న ఉదయం 08.30 గంటలకుఅదే ప్రాంతంలో అనగా 9.3° ఉత్తర అక్షాంశం, 86.9° తూర్పు రేఖాంశం సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పున 630 కిలోమీటర్లు, శ్రీ విజయపురం (అండమాన్, నికోబార్ దీవులు)కి పశ్చిమ-నైరుతి దిశలో 690 కిలోమీటర్లు, చెన్నై (తమిళనాడు)కి తూర్పు-ఆగ్నేయంగా 840 కిలోమీటర్లు, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 1010 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-ఆగ్నేయంగా 1130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, నవంబర్ 16న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలు, ఆనుకొని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. నవంబర్ 17న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత,ఇది మరింత బలపడి తదుపరి 2 రోజులలో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.

తుఫాన్ ప్రభావంతో రాగల మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో ఈరోజు ,రేపు, ఎల్లుండి  తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తుఫాన్ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాలు పడే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నెల 18,19వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 నండి 50కి.మీ వేగంతో, గరిష్టంగా 60 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ హెచ్చరించింది. అటు ఈ తుఫాన్‌కు ఇప్పటికే అక్వాన్ అనే పేరు నామకరణం చేశారు. తుఫాన్‌గా మారిన తర్వాత ఈ పేరు ఫిక్స్ చేయనున్నారు. ఈ తీవ్ర తుపాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. అయితే ఏపీలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అర్నబ్, మురసు తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

Follow Us