AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం! డ్రైనేజీలో చిక్కుకున్న గోమాత.. సమయస్ఫూర్తితో కాపాడిన స్థానికులు!

విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో ప్రమాదవశాత్తు ఓ గోవు డ్రైనేజీలో పడిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే స్థానికులు, పారిశుధ్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో గోమాతకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడింది. చివరకు గోమాత సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయ్యో పాపం! డ్రైనేజీలో చిక్కుకున్న గోమాత.. సమయస్ఫూర్తితో కాపాడిన స్థానికులు!
Cow Rescued
Balaraju Goud
|

Updated on: Nov 15, 2026 | 11:30 AM

Share

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో ప్రమాదవశాత్తు ఓ గోవు డ్రైనేజీలో పడిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే స్థానికులు, పారిశుధ్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో గోమాతకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. శనివారం (నవంబర్ 14) రాత్రి సమయంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఓ డ్రైనేజీలో ప్రమాదవశాత్తు గోవు పడిపోయింది. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరికీ విషయం తెలియలేదు. ఆదివారం ఉదయం స్థానికులు డ్రైనేజీలో గోవు పడిపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు గోవును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

అయితే డ్రైనేజీ లోతుగా ఉండటంతో సాధారణంగా బయటకు తీయడం సాధ్యం కాలేదు. దీంతో పారిశుధ్య సిబ్బంది సహకారం తీసుకున్నారు. సిబ్బంది ప్రొక్లైన్ యంత్రాన్ని అక్కడికి తీసుకువచ్చి, స్థానికుల సహకారంతో జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రొక్లైన్ సాయంతో గోవును ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ నుంచి బయటకు తీశారు. చివరకు గోమాత సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులు, పారిశుధ్య సిబ్బందిని పలువురు అభినందించారు.

ఈ ఘటనతో కాలనీల్లోని డ్రైనేజీల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా బహిరంగంగా ఉన్న డ్రైనేజీలకు రక్షణ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us