AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మదొంగ.. పెద్ద స్కెచ్చే ఇది.. యూట్యూబర్‌ మీనాక్షి అరెస్ట్..

తమిళనాడులోని మదురైలో తనిష్క్ జ్యూవెలరీ షోరూమ్‌లో జరిగిన రూ.50 కోట్ల భారీ దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు నిషాంత్ ప్రియురాలు, యూట్యూబర్ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన నగలను దాచిపెట్టడంలో ఆమె సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిందితుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని ఇప్పటివరకు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

అమ్మదొంగ.. పెద్ద స్కెచ్చే ఇది.. యూట్యూబర్‌ మీనాక్షి అరెస్ట్..
Youtuber Meenakshi Arrested
Shaik Madar Saheb
|

Updated on: Nov 15, 2026 | 11:04 AM

Share

తమిళనాడులో సంచలనం రేపిన తనిష్క్ నగల దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యూ ట్యూబర్‌ మీనాక్షి అరెస్ట్ అయింది. ఇంతకీ ఈ చోరీకి ..యూట్యూబర్‌ అరెస్ట్‌ లింకేంటి? ఓసారి స్టోరీ లేట్స్‌లోకి వెళితే.. మదురైలో కొత్తగా ప్రారంభమైన తనిష్క్ జ్యూవెలరీ షోరూమ్‌లో 2రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. షో రూమ్ వెనకనుంచి చొరబడిన దుండగులు 50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడి గర్ల్‌ఫ్రెండ్ ప్రముఖ యూట్యూబర్, ఇన్‌ ఫ్లుయెన్సర్ మీనాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను దాచిపెట్టడంలో సహకరించిందన్న ఆరోపణలతో మీనాక్షిని మధురై సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషాంత్ తండ్రి సురేష్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి యూట్యూబర్ నిషాంత్‌ మాత్రం పరారీలో ఉన్నాడు.

విచారణలో బంగారం దోపిడీలో మీనాక్షి హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమైంది. దొంగలించిన నగలను దాచిపెట్టమని మీనాక్షికి నిషాంత్ ఇచ్చినట్టు విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే కొంత బంగారాన్ని నిషాంత్ తన తండ్రి సురేశ్‌కు కూడా ఇచ్చినట్లు తేలింది. అయితే బంగారాన్ని మదకులమ్ అటవీ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దాచిపెట్టినట్లు తెలియడంతో మీనాక్షిని స్పాట్‌కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ నిందితుల నుంచి 6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారం కూడా రికవరీ చేయాల్సి ఉందన్నారు పోలీసులు.

నవంబర్ 10 న రాత్రి ఎప్పటిలాగే షో రూమ్ సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మరుసటి ఉదయం వచ్చి చూసేసరికి షాపులో దోపిడీ జరిగినట్లు గుర్తించారు. దాదాపు 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 9 ప్రత్యేక బృంఘాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ మీనాక్షిని, అలాగే ప్రధాన నిందితుడి తండ్రి సురేశ్ ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ సెక్యూరిటీ ఉన్న జ్యువెలరీ షోరూమ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యువకులు ఈ దురాగ్యానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పరారీలో ఉన్న నిషాంత్‌ దొరికితే మిగతా బంగారం గురించి తెలిసే అవకాశం ఉందన్నారు పోలీసులు..

Follow Us