AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 ఏళ్లు ప్రేమించుకొని బ్రేకప్ చెప్పుకున్నాం.. తర్వాత మరొకరితో డేటింగ్ చేశా.. షాకింగ్ విషయం చెప్పిన కాజల్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె.. తన అందం, అభినయంతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు .

14 ఏళ్లు ప్రేమించుకొని బ్రేకప్ చెప్పుకున్నాం.. తర్వాత మరొకరితో డేటింగ్ చేశా.. షాకింగ్ విషయం చెప్పిన కాజల్
Kajal
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 10:56 AM

Share

సినిమా తారల ప్రేమకథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అందరి లాగే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులు ఉంటాయి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుల ప్రేమ ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్, తమ 14 ఏళ్ల ప్రేమ, మధ్యలో ఎదురైన బ్రేకప్, పెళ్లికి ముందు తాను పెట్టిన షరతు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ ప్రేమ గురించి కాజల్ మాట్లాడుతూ.. “సుమారు 13-14 ఏళ్ల క్రితమే మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ అప్పట్లో మా పరిస్థితులు అనుకూలించకపోవడంతో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయాం. ఇద్దరం వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కూడా చేశాం” అని నిజాయితీగా చెప్పారు.

వేరే వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే, తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధం ఏంటో వారికి అర్థమైందట. “బహుశా ఒకరి విలువ మరొకరికి తెలియడానికే మేము వేరే వాళ్లతో డేటింగ్ చేశామేమో.! చివరకు విధి మమ్మల్ని మళ్లీ కలిపింది. మా దారులు ఒక్కటయ్యాయి” అంటూ కాజల్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. రెండోసారి దగ్గరైన తర్వాత, ఈసారి బంధం విషయంలో ఎలాంటి అస్పష్టత ఉండకూడదని కాజల్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే గౌతమ్‌కు నేరుగా ఒక అల్టిమేటం ఇచ్చారట. “నేను గౌతమ్‌తో ఒకటే మాట చెప్పాను.. ‘ఓకే బాస్, ఈసారి మనం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేదంటే శాశ్వతంగా గుడ్‌బై చెప్పుకోవాలి’ అని తేల్చి చెప్పేశాను” అని కాజల్ వివరించారు. గౌతమ్ కూడా అదే ఆలోచనతో ఉండటంతో వీరి పెళ్లికి మార్గం సుగమమైంది.

ఇరు కుటుంబాల అంగీకారంతో 2020 అక్టోబర్ 30న ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2022 ఏప్రిల్‌లో వీరికి కుమారుడు ‘నీల్’ జన్మించాడు. ప్రస్తుతం ఒకవైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు పాన్ ఇండియా సినిమాల్లో వరుస అవకాశాలతో కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిజమైన ప్రేమ ఎక్కడికి వెళ్లినా తిరిగి తన గమ్యాన్ని చేరుకుంటుందనేందుకు కాజల్-గౌతమ్ జంట ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us