AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 5th ODI: చేతులెత్తేసిన బ్యాటర్లు.. 209 పరుగులకే భారత్ ఆలౌట్..

New Zealand vs India, 2nd ODI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచారు. ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అయితే అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. చివరకు భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది.

IND vs NZ 5th ODI: చేతులెత్తేసిన బ్యాటర్లు.. 209 పరుగులకే భారత్ ఆలౌట్..
Ind Vs Nz 5th Odi
Venkata Chari
|

Updated on: Nov 15, 2026 | 10:43 AM

Share

New Zealand vs India, 2nd ODI: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సీనియర్ ఆటగాళ్ల పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐదో వన్డేలోనూ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులను నిరాశపరిచారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ కేవలం 13 బంతుల్లో 7 పరుగులు చేసి మాట్ ఫిషర్ బౌలింగ్‌లో ఫాక్స్‌క్రాఫ్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసి ఫిషర్ బౌలింగ్‌లో సీఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత టాప్ ఆర్డర్‌పై మరోసారి విమర్శలు మొదలయ్యాయి.

అక్షర్, ఇషాన్ పోరాటం..

టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలో అక్షర్ పటేల్ (Axar Patel), ఇషాన్ కిషన్ (Ishan Kishan) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ చెరో 46 పరుగులు సాధించారు. అక్షర్ 55 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఇషాన్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.

అయితే వీరిద్దరూ అర్ధసెంచరీలకు చేరువలోనే వికెట్లు కోల్పోవడం భారత్‌కు ఎదురుదెబ్బగా మారింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 26 బంతుల్లో 22 పరుగులు చేశాడు. నమన్ ధీర్ కూడా 31 బంతుల్లో 22 పరుగులు సాధించాడు.

చివర్లో అర్ష్‌దీప్ మెరుపులు..

చివరి ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) మెరుపులు మెరిపించాడు. కేవలం 4 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ 20 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ ఫిషర్ భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగా, మిచెల్ సాంట్నర్ కూడా కీలక వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు సాధించాడు.

చివరకు టీమిండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు 210 పరుగుల లక్ష్యం నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

Follow Us