AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి శ్రీదేవి రొమాంటిక్ మూవీ.. యూత్ కు తెగ నచ్చేసిన సినిమా

అక్టోబర్ 23న తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి శ్రీదేవి రొమాంటిక్ మూవీ.. యూత్ కు తెగ నచ్చేసిన సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 10:50 AM

Share

‘కోర్ట్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి ఆపళ్ల. అంతకు ముందు పలు సినిమాల్లో సహాయక నటిగా చేసిన ఆమె ఈ చిత్రంలో హీరోయిన్ గా అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో ఆమె అందం, అభినయం, ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ ఫిదా అయిపోయారు. కాగా కోర్టు తర్వాత బ్యాండ్ మేళం అనే ఓ సినిమా చేసింది శ్రీదేవి. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఇటీవలే ‘హైకూ’ అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలో శ్రీదేవితో పాటు ఏగన్, ఫెమినా జార్జ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 23న తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన హైకూ మూవీ బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో హైకూ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘హైకూ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

హైకూ సినిమా విషయానికి వస్తే.. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీదేవి, ఏగన్‌లతో పాటు మైమ్ గోపి, ఫెమినా జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన మనోహర్ (ఏగన్).. సిటీలోని వేరే కాలేజీల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో కో-ఎడ్యుకేషన్‌గా మారిన కాలేజీలో చేరతాడు. అక్కడ పవళకుడి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక జాబ్ కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళ్తాడు. ఇదే సమయంలో కుడి వేరే పెళ్లి చేసుకుంటుంది. అలాగే మనోహర్ కూడా చెన్నైలో ఇంటర్న్‌గా పనిచేసే నివేదా(ఫెమినా జార్జ్)తో ప్రేమలో ఉంటాడు. మరి కుడి, మనోహర్ ఎందుకు విడిపోయారు?కుడి మరో పెళ్లి ఎందుకు చేసుకుంది? నివేదా మనో కూడా ఎందుకు విడిపోయారు? అసలు ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే హైకూ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో శ్రీదేవి హైకూ సినిమా..

హైకూ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us