AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందిగా.. ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా సుమాడి బజార్ ప్రాంతంలో ఓ చిరుతపులి ఏకంగా నివాస గృహంలోకి చొరబడింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేయడమే కాకుండా, దాని మృతదేహాన్ని బాత్రూమ్‌లోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వార్నీ.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిందిగా.. ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!
Leopard Enters House
Balaraju Goud
|

Updated on: Nov 15, 2026 | 10:46 AM

Share

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా సుమాడి బజార్ ప్రాంతంలో ఓ చిరుతపులి ఏకంగా నివాస గృహంలోకి చొరబడింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేయడమే కాకుండా, దాని మృతదేహాన్ని బాత్రూమ్‌లోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. సుమాడి బజార్ నివాసి దినేష్ థప్లియాల్ ఇంట్లోకి చిరుతపులి అకస్మాత్తుగా ప్రవేశించింది. అక్కడ ఉన్న పెంపుడు కుక్కను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అనంతరం కుక్కను బాత్రూమ్‌లోకి ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్థానికులు భయపడకుండా ఎంతో ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. చిరుత బాత్రూమ్‌లో ఉన్న విషయాన్ని గమనించి, వెంటనే తలుపును బయట నుంచి మూసివేశారు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాత్రూమ్‌లో చిరుత చిక్కుకుందన్న వార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిరుతను ఎలాంటి ప్రమాదం కలగకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కాగా, గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు పాల్పడటంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస ప్రాంతంలో వెంటనే బోనులు ఏర్పాటు చేయాలని, చిరుతను పట్టుకునే చర్యలు వేగవంతం చేయాలని గ్రామస్తులు అటవీ శాఖను కోరుతున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి, జనావాసాల్లోకి చిరుతల చొరబాట్లు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us