చిన్న ఆకులే కదా అని తీసిపారేయకండి.. రోజూ 5 ఆకులు నోట్లో వేసుకోండి!
15 November 2026
TV9 Telugu
TV9 Telugu
వంటకు మంచి రుచి, సువాసన అందించినా.. తినే సమయంలో మాత్రం చాలామంది కరివేపాకు పక్కన పెట్టేస్తుంటారు
TV9 Telugu
కానీ ఈ చిన్న ఆకుల్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయని మీకు తెలుసా? కరివేపాకులో ఐరన్, ఏ, సీ విటమిన్లు, ఫైబర్ వంటివి ఉంటాయి
TV9 Telugu
ఐరన్ రక్తహీనత నివారణకు సహకరిస్తుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, విటమిన్ సీ రోగనిరోధకతకు మేలు చేస్తాయి
TV9 Telugu
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్త కణాల ఆరోగ్యానికి తోడ్పడటంతోపాటు, జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని కొంతవరకు అరికడతాయి
TV9 Telugu
ఫైబర్, సహజ ఎంజైమ్‌లు జీర్ణక్రియ సక్రమంగా సాగడానికి సహాయపడతాయి
TV9 Telugu
అంతేకాదు చర్మాన్ని కాంతిమంతంగా మెరిసేలా చేయడంతోపాటు మొటిమలు వంటి సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
కరివేపాకును పొడిగాను, చట్నీ, పప్పు, కూరల్లో భాగంగా చేసుకుని తీసుకోవచ్చు. కాబట్టి చిన్న ఆకే కదా అని తీసిపారేయకండి
TV9 Telugu
రోజుకు 5 నుంచి 10 తాజా ఆకులను నమిలి తినండి లేదా వంటల్లో కలిపి తీసుకోండి. ఆరోగ్యానికి ఎంతో మేలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి