AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంద్రధనుస్సు పక్కనే వింత ఆకారం.. ఏలియన్ల నౌకనా? డ్రోనా? అసలు మిస్టరీ ఇదే!

అమెరికాలోని అలాస్కా రాష్ట్రం, అంకరైజ్ ప్రాంతంలో ఆకాశంలో కనిపించిన ఒక వింత వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సారా జేన్ ఆస్బన్ అనే మహిళ అందమైన రెయిన్‌బోను ఫోటో తీస్తున్న సమయంలో, నీటిలో ఉండే జెల్లీ ఫిష్ ఆకారంలో, కిందకు వేలాడే వింత స్పర్శకలతో ఉన్న ఒక పెద్ద వస్తువు ఆకాశంలో తేలుతూ కనిపించింది. ఇది యూఎఫ్‌వోనా, ఏలియనా లేక గాలిపటమా అనే దానిపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇంద్రధనుస్సు పక్కనే వింత ఆకారం.. ఏలియన్ల నౌకనా? డ్రోనా? అసలు మిస్టరీ ఇదే!
Alaska Mysterious Flying Object
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2026 | 10:21 AM

Share

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అమెరికాలోని అలాస్కాలో వెలుగు చూసిన ఒక వింత సంఘటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా తీవ్రమైన చర్చకు దారితీసింది. అలాస్కాలోని అంకరైజ్ ప్రాంతంలో ఆకాశంలో తేలుతున్న ఒక వింత వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అంతర్జాతీయం అంతటా వైరల్ అవుతోంది. ఇది ఏలియన్ సంబంధించినదా లేక మరేదైనా సాంకేతిక పరికరమా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

అసలు వీడియోలో ఏముంది?

సారా జేన్ ఆస్బన్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశంలో అద్భుతమైన రెయిన్‌బో ఏర్పడింది. దానిని ఫోటో తీస్తున్న సమయంలో ఆమె కంట పడిన ఈ వింత దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేసింది. అచ్చం సముద్రంలో కనిపించే జెల్లీ ఫిష్ మాదిరిగా ఉన్న ఆ వస్తువు కింద వైపు వేలాడే టెంటికల్స్ వంటి నిర్మాణాలతో గాలిలో తేలుతూ కనిపించింది. సుమారు మూడు నిమిషాల పాటు ఆకాశంలో అలాగే సంచరించిన ఆ వస్తువు, ఆ తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు, చర్చ:

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది భూమిపైకి వచ్చిన ఏవైనా గ్రహాంతర వాసుల నావ అయి ఉండొచ్చని కొందరు నమ్ముతున్నారు. ఈ ప్రాంతం సైనిక స్థావరానికి సమీపంలో ఉండటంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. మరికొన్ని వర్గాల వారు మాత్రం ఇది ఎవరైనా ఎగరేసిన వినూత్న రూపంలో ఉన్న పెద్ద గాలిపటం అయి ఉంటుందని భావిస్తున్నారు. గాలికి దాని కింద ఉండే భాగాలు కదలడం వల్ల అది జెల్లీ ఫిష్‌లా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ లేదా అత్యాధునిక డ్రోన్ కావచ్చని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ వింత వస్తువు వెనుక అసలు నిజం ఏంటనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిపుణులు, అధికారులు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఈ వీడియో మాత్రం అంతర్జాతీయం లోని ప్రజలను, స్పేస్ పరిశోధకులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us