తెలుగులో దూసుకుపోతున్న కేరళ భామ అనశ్వర రాజన్
14 November 2026
Rajeev Rayala
కేరళకు చెందిన అనశ్వర రాజన్ మలయాళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ
ుతోంది.
రోషన్ మేక హీరోగా నటించిన 'చాంపియన్' సినిమాతో అనశ్వర టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో తల్లపూడి చంద్రకళ పాత్రలో కనిపించింది.
తొలి తెలుగు చిత్రంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు
వచ్చాయి.
అనీష్‌కు జోడీగా 'ఇట్లు అర్జున' సినిమాలో నటించింది. ఇందులో కీర్తి అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం
చేసుకుంది.
ఇట్లు అర్జునలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమాను ఎంచుకున్నట్లు అనశ్వర గతంలో వెల్లడించింది.
యంగ్ హీరో సంగీత్ శోభన్ సరసన 'అంతా రాములవారూ చూసుకుంటారు' అనే సినిమాలో నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న కాకా సినిమాలో అనశ్వర నటిస్తోంది. ఇందులో చిరంజీవి కుమార
్తె పాత్రలో కనిపించనుందని సమాచారం.
దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న రవితేజ సినిమా 'తులాభారం'లోనూ అనశ్వర కీలక పాత్రలో నటిస్తుంది
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్