అబ్బో.. వైష్ణవి చేతిలో క్రేజీ సినిమాలు .. అవేంటంటే 

14 November 2026

Rajeev Rayala 

బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటించిన సినిమా ఎపిక్ . ఈ సినిమా ఇటీవలే విడుదలై పర్లేదు అనిపించుకుంది.

 నితిన్‌తో కొత్త సినిమా: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో హీరో నితిన్‌తో కలిసి వైష్ణవి ఓ సినిమాలో నటిస్తోందని తెలుస్తుంది.

 రెండు తమిళ సినిమాలు: తెలుగు సినిమాలతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.

హిందీ సినిమాలోనూ ఛాన్స్: వైష్ణవి ఓ హిందీ సినిమాలో కూడా నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. త్వరలోనే దీని పై అప్డేట్స్ రానున్నాయి. 

ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా కథకు, తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది.

 టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

 వైష్ణవి మూడు ఇండస్ట్రీల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుంది.