AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీజేలు, హారన్లు, పెద్ద శబ్దాలు.. మీ చెవుల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?

అధిక శబ్దాలు లేదా తీవ్రమైన శబ్దాలు కేవలం వినికిడి శక్తిని దెబ్బతీయడమే కాకుండా, శరీర సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవి లోపలి భాగంలో ఉండే సున్నితమైన కేశ కణాలు తీవ్రమైన శబ్దాల కారణంగా శాశ్వతంగా దెబ్బతింటాయి. దీనివల్ల చెవుల్లో రింగుమనే శబ్దం రావడం, వినికిడి మందగించడం జరుగుతుంది. అంతేకాకుండా, చెవి లోపల ఉన్న వెస్టిబ్యులర్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మైకం, తలతిరగడం, నిలకడ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ శబ్ద కాలుష్యానికి త్వరగా గురవుతారు. కాబట్టి అధిక శబ్దాలకు దూరంగా ఉండటం, తగిన రక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.

డీజేలు, హారన్లు, పెద్ద శబ్దాలు.. మీ చెవుల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా?
Effects Of Loud Noise On Ears
Jyothi Gadda
|

Updated on: Nov 15, 2026 | 11:14 AM

Share

నేటి ఆధునిక జీవనశైలిలో శబ్ద కాలుష్యం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ట్రాఫిక్ హోరు, పెద్దపెద్ద స్పీకర్లలో మోగే సంగీతం, పటాకులు, కర్మాగారాల్లోని యంత్రాల శబ్దాలు మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే, ఈ అధిక తీవ్రత కలిగిన శబ్దాలు కేవలం మన వినికిడి శక్తిని మాత్రమే కాకుండా, శరీర సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చెవి లోపలి కణాలపై శబ్దాల ప్రభావం:

మన చెవి లోపలి భాగంలో శబ్ద తరంగాలను గ్రహించే అత్యంత సూన్నితమైన కేశ కణాలు ఉంటాయి. అత్యంత తీవ్రమైన శబ్దాలకు గురైనప్పుడు ఈ కణాలు దెబ్బతింటాయి లేదా పూర్తిగా నశించిపోతాయి. మానవ శరీరంలో ఈ కణాలు పునరుత్పత్తి చెందే శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల, శబ్దాల కారణంగా జరిగే ఈ నష్టం చాలాసార్లు శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది.

టిన్నిటస్, ఇతర సమస్యలు:

అధిక శబ్దాలకు గురైన తర్వాత కొందరిలో చెవుల్లో నిరంతరం రింగుమని శబ్దం రావడం, గుయ్ మనే శబ్దం లేదా ఈల వేసినట్లు వినిపించడం జరుగుతుంది. దీనిని టిన్నిటస్ అంటారు. కొద్దిసేపు ఉండి తగ్గిపోతే పరవాలేదు గానీ, ఇది నిరంతరం కొనసాగితే వినికిడి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

శరీర సమతుల్యతపై ప్రభావం:

చాలామందికి వినికిడికి, శరీర సమతుల్యతకు సంబంధం ఉందని తెలియదు. కానీ చెవి లోపలి భాగంలోనే మన శరీర సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడే వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. తీవ్రమైన శబ్దాల వల్ల ఈ అంతర్గత వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు, వ్యక్తులలో మైకం, తల తిరగడం, నడకలో తూలడం, స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఎవరు ఎక్కువగా ప్రభావితమవుతారు?

పిల్లలు, వృద్ధులు, నిత్యం పెద్ద శబ్దాలు ఉండే వాతావరణంలో పనిచేసేవారు దీనికి త్వరగా బలవుతారు. కాబట్టి అనవసరంగా అధిక శబ్దాలకు దూరంగా ఉండటం, అవసరమైనప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడటం ద్వారా మన శ్రవణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us