వారెవ్వా.. ఎన్ని లాభాలో... రేగు పండ్లతో ఊహించని ప్రయోజనాలు!
samatha
14 November 2026
Pic credit - Pinterest
చలికాలంలో లభించే పండ్లలో రేగు పండ్లు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా సంక్రాంతి పండుగ తర్వాత లభిస్తుంటాయి.
సీజనల్ ఫ్రూట్స్
కానీ ఈ మధ్య కాలంలో చలికాలం ప్రారంభంలోనే మార్కెట్లోకి వచ్చేశాయి. ఇక రేగు పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు.
రేగు పండ్లు
ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాగా, ఇప్పుడు మనం రేగు పండ్లు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
పోషకాలు
రేగి పండు, దీనిని జుజుబీ ఫ్రూట్ అని కూడా అంటారు, ఎన్నో అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్న పండు. విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు రేగి పండ్లలో అధికంగా ఉంటాయి
రేగి పండ్లు
ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీని ఫలితంగా, శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
క్రమం తప్పకుండా తీసుకోవడం
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు రేగి పండ్లలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని తినడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుంది.
చర్మ సౌందర్యం
అదే విధంగా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా రేగి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
గుండె ఆరోగ్యం
అంతే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం రేగి పండ్లకు ఉంది కాబట్టి, షుగర్ వ్యాధితో బాధపడేవారు వీటిని తీసుకోవడం చాలా మంచిది.