Khelo India: తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. లోగోను లాంచ్ చేసిన ప్రధాని మోదీ
తెలంగాణ వేదికగా నిర్వహించబోతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ లోగోను ఆదివరాం ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఢిల్లీలోని 7లోక్ కల్యాణ్ మార్గ్ లో సీఎం రేవంత్ రెడ్డి ,కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి సమక్షంలో ప్రధాని మోదీ లోగోను లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణలో నిర్వహించబోయే గెమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించారు.

తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు సంబంధించిన లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ప్రధానిని కలిశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హాజరుకావాలని మోదీని ఆహ్వానించారు.
దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీల 8వ ఎడిషన్‌కు తెలంగాణ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 డిసెంబర్ 11 నుంచి 22 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ క్రీడా సంబరం జరగనుంది.దేశవ్యాప్తంగా సుమారు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు, 1,800 మంది సపోర్ట్ స్టాఫ్ ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
ఐదు నగరాల్లో పోటీలు
హైదరాబాద్ ప్రధాన వేదికగా 22 మెడల్ స్పోర్ట్స్ నిర్వహించబడతాయి. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం కాంప్లెక్స్ బషీర్బాగ్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితర ప్రాంగణాల్లో పోటీలు జరుగుతాయి. మిగతా క్రీడలు ఐదు నగరాల్లో జరగనున్నాయి. ఖమ్మంలో ఆర్చరీ, హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు.ఈ ఎడిషన్‌లో మొత్తం 27 పోటీ క్రీడలు, ఒక డెమాన్‌స్ట్రేషన్ స్పోర్ట్ ఉంటాయి. సాఫ్ట్‌బాల్ తొలిసారి పోటీ క్రీడగా చేరడం విశేషం.ఈసారి రోయింగ్ కూడా కొత్తగా చేర్చబడింది.
ఖేలో ఇండియాలో ఆడే క్రీడలు
ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, గత్కా, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కలరిపయట్టు, ఖో-ఖో, మల్లాఖంబ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, థాంగ్-తా, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగాసనాలు ఉన్నాయి.0
బరిలో డిఫెండింగ్ ఛాపింయన్ మహారాష్ట్ర
గత సంవత్సరం బీహార్‌లో జరిగిన 7వ ఎడిషన్‌లో మహారాష్ట్ర 58 గోల్డ్ మెడళ్లతో ఛాంపియన్‌గా నిలిచి వరుసగా మూడోసారి టైటిల్ నెగ్గింది. ఈసారి కూడా మహారాష్ట్ర డిఫెండింగ్ ఛాంపియన్‌గా మైదానంలోకి దిగనుంది. డిసెంబర్ 11న గచ్చిబౌలిలో ప్రారంభోత్సవం జరగనుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తో తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు యువ ప్రతిభకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
