గ్యాస్ స్టవ్ సర్వీస్ కాలం ఎంత..? ఎన్నేళ్ల తర్వాత మార్చుకోవాలి..?
Venkatrao Lella
Images: Pinterest
14 November 2026
ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్ తప్పనిసరిగా వాడుతుంటారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకే స్టవ్ వాడుతుంటారు. తుప్పు పట్టినా, పాడైపోయినా అదే ఉపయోగిస్తుంటారు.
గ్యాస్ స్టవ్ పాతది అయిపోయినా సరే రీపేర్ చేయించుకుని మరీ వినియోగిస్తుంటారు. కానీ పాతదైన స్టవ్‌ను వాడటం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్టవ్ ఎప్పుడు మార్చాలంటే..?
స్టవ్ వాడుతున్నప్పుడు ఏమైనా శబ్దాలొస్తే మాత్రం వెంటనే దానిని పక్కన పడేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. లోపల సమస్యల వల్ల అలా రావొచ్చు
స్టవ్‌లో లోపాల వల్ల గ్యాస్ ఎక్కువగా తీసుకోవడం, వంట అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి సందర్బాల్లో కొత్తది తీసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే స్టవ్ లైఫ్ పీరియడ్ అయిపోయిందని అర్థం.
గ్లా్స్ స్టవ్స్‌కు పగుళ్లు రావడం, బ్రేక్ అవ్వడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ పగుళ్ల ద్వారా వేడి లోపలికి వెళ్లి వాల్వ్స్ దెబ్బతింటాయి. దీని వల్ల పెద్ద ప్రమాదం.
స్టవ్ తక్కువ ఫ్లెమ్‌లో ఉంచినా ఎక్కువ మంట రావడం, మంట ఎక్కువ పెట్టినా తక్కువ రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు నాబ్స్లో సమస్యలు ఉన్నాయని అర్థం.
నాబ్స్లో సమస్యలు ఉన్నప్పుడు పాత స్టవ్‌ను రీపేర్ చేయించుకోవడం బదులు కొత్తది కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీకే బెనిఫిట్ ఉంది.
గ్యాస్‌లో ఏదైనా సమస్య ఉండి రీపేర్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంటే కొత్త గ్యా్స్ స్టవ్ కొనుగోలు చేయడమే ఉత్తమం. మీకు కొత్త గ్యాస్ లభిస్తుంది.
స్టవ్ ఆన్ చేసినప్పుడు లేదా ఆఫ్ చేసినప్పుడు గ్యాస్ స్మెల్ వస్తున్నా లోపం ఉండొచ్చు. ఇలాంటి సమయంలో కొత్త గ్యా్స్ తీసుకోవం మంచిది