Lazy Chicken Recipe: బ్రహ్మచారుల కోసం సోంబేరీ చికెన్.. ఉల్లిపాయలు, మసాలాలతో పనిలేదు.. క్విక్ రెసిపీ!
బ్రహ్మచారులకు వంట చేయాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది. ముఖ్యంగా చికెన్ వండాలంటే ఉల్లిపాయలు తరగాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, రకరకాల మసాలాలు కలపాలి.. ఇలా చాలా పనులు ఉంటాయి. అందుకే చాలామంది చికెన్ వండాలంటే వెనుకడుగు వేస్తుంటారు. అలాంటివారి కోసమే ఈజీగా తయారయ్యే సోంబేరీ చికెన్ రెసిపీ. ఇందులో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ పాత్రలు కూడా ఉపయోగించాల్సిన పనిలేదు.

సోంబేరీ చికెన్‌కు కావాల్సిన పదార్థాలు
-
అర కిలో చికెన్
-
2 టీ స్పూన్ల కారం
-
అర టీ స్పూన్ పసుపు
-
2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
-
ఒక టీ స్పూన్ ధనియాల పొడి
-
అర టీ స్పూన్ గరం మసాలా
-
ఒక టీ స్పూన్ ఉప్పు
-
2 టేబుల్ స్పూన్ల పెరుగు
-
2 టేబుల్ స్పూన్ల నూనె
-
కొద్దిగా కరివేపాకు
-
కొత్తిమీర
-
అర కప్పు నీళ్లు
చికెన్‌లో మసాలాలన్నీ కలిపేయండి
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసుకోవాలి. చివరగా నూనె కూడా వేసి ముక్కలన్నింటికీ మసాలాలు పట్టేలా బాగా కలపాలి. వీలైతే 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టాలి.
స్టవ్‌పై పెట్టి ఉడికించండి
ఇప్పుడు మందపాటి గిన్నె లేదా కుక్కర్ తీసుకుని అందులో మసాలా కలిపిన చికెన్ వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టి మీడియం మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.
చికెన్ దగ్గరపడే వరకు ఉడికించాలి
చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మూత తీసి నీరు తగ్గే వరకు మరికొద్దిసేపు ఉడికించాలి. మసాలా చికెన్ ముక్కలకు బాగా పట్టి కొద్దిగా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.
వేడి వేడి సోంబేరీ చికెన్ రెడీ!
అంతే.. ఎంతో సులభంగా సోంబేరీ చికెన్ సిద్ధమైపోతుంది. దీన్ని వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ లేదా జీరా రైస్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వంట చేయడానికి పెద్దగా ఓపిక లేని బ్రహ్మచారులకు ఇది మంచి రెసిపీ.
