Raw Carrot: చలికాలంలో రోజు ఒక క్యారెట్ తింటే చాలు.. హాస్పిటల్స్‌కు వెళ్లే పనిలేదు!
క్యారేట్ తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది క్యారెట్‌ను కూరల్లో లేదా వాడుతూ ఉంటారు. అయితే ఇలా వండిన క్యారెట్‌తో పోల్చుకుంటే పచ్చి క్యారెట్‌లోని ఎక్కవ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ పచ్చి క్యారెట్లు తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

ప్రతి ఇంట్లో కచ్చితంగా క్యారెట్ వంటకాలు ఉండాల్సిందే.. ఇవి టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరు పచ్చి క్యారెట్లను ఆహారంలో చేర్చుకుంటే మరికొందరు వాటిని వంటకాల్లో వాడుతారు. అయితే వండిన క్యారెట్ల కంటే పచ్చి క్యారెట్లో పోషకాలు ఎక్కవగా ఉంటాయి. హెల్త్ కోచ్ ల్యూక్ కౌటిన్హో ప్రకారం, మీ ఆరోగ్యానికి ప్రతిరోజూ ఉత్తమమైన కూరగాయ ఏదైనా ఉందంటే అది క్యారెట్లే. మీరు ఖరీదైన మందులు వాడకుండా రోజు ఒక క్యారెట్ తింటే చాలు చలికాలంలో మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటాచని ఆయన తెలిపారు. క్యారెట్లలో బీటా కెరోటిన్, కెరోటినాయిడ్లు, ముఖ్యంగా ఫాల్కరినాల్ ఉంటాయి, ఇవి శరీరానికి అత్యంత ప్రయోజనకరమైనవి.
పచ్చి క్యారెట్ తినడం వల్ల ప్రయోజనాలు
హార్మోన్ల సమతుల్యత: క్యారెట్లలో ఫాల్కరినాల్ ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను, మహిళలల్లో PCOD, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, మెనోపాజ్ వంటి ఈస్ట్రోజెన్ ఆధిపత్యానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి,
క్యాన్సర్‌కు చెక్: కారెట్లలో ఉండే పోషకాలు క్యాన్సర్ పెరుగుదలకు కారణమయ్యే కణాలను నిరోదిస్తాయి. అలాగే కణితుల వ్యాప్తిని నివారించి.. దెబ్బతిన్న కణాలను బాగు చేస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. క్యారెట్లలోని ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేసి, పేగు మైక్రోబయోమ్‌ను బలపరుస్తుంది. తద్వారా జీర్ణక్రయిను మెరుగుపరుస్తుంది.
వెయిట్ లాస్: బరువు తగ్గాలనుకునే వారికి క్యారెట్ చాలా మంది. క్యారెట్లలోని ఫైబర్, ప్రోటీన్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, అతిగా తినకుండా చేస్తాయి. అలాగే కొవ్వును తగ్గిస్తాయి. బీపీ ఉన్న వారికి కూడా క్యారెట్ మంచిది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేసి రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.
గుండెను ఆరోగ్యం: పచ్చి క్యారెట్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే క్యారెట్లలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A గా మారి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
చర్మాన్ని కాంతి: రోజూ పచ్చి క్యారెట్లు తినడం వల్ల శరీరం లోపలి నుండి నిర్విషీకరణ చెంది, ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన చర్మానికి దారితీస్తుంది. అయితే వీటి ప్రయోజనాలు పొందాలి అంటే ప్రతిరోజూ భోజనానికి ముందు సలాడ్‌గా ఒక పచ్చి క్యారెట్‌ను తినండి. ఇది మీ ఆహారానికి, జీర్ణక్రియకు, హార్మోన్ల ఆరోగ్యానికి బూస్టర్‌గా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
