AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..? ఈ నిజాలు తెలుసుకోండి..

జామపండు తినేటప్పుడు మీరూ గింజలను ఏరి పారేస్తున్నారా..? లేక గింజలతో సహా నమిలి మింగేస్తున్నారా? చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పినట్లు గింజలు మింగితే కడుపులో చెట్టు మొలుస్తుంది అన్న భయం ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది. మరి నిజంగానే ఆ గట్టి జామ గింజలు కడుపులోకి వెళితే జీర్ణమవుతాయా? లేక ఏమైనా ప్రమాదం ఉందా? వైద్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

జామకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..? ఈ నిజాలు తెలుసుకోండి..
What Happens If You Swallow Guava Seeds
Krishna S
|

Updated on: Nov 15, 2026 | 5:19 PM

Share

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పండ్లలో జామపండు ఒకటి. అయితే జామపండు తినేటప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంటుంది. కొందరు గింజలను తీసి పారేస్తే, మరికొందరు గింజలతో సహా తినేస్తుంటారు. అసలు జామ గింజలు చాలా గట్టిగా ఉంటాయి కదా.. వాటిని మింగితే కడుపులో జీర్ణమవుతాయా? లేక ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారు జామకాయను దాని గింజలతో సహా మితంగా తినడం పూర్తిగా సురక్షితం. ప్రతి గింజను ఏరి పారవేయాల్సిన అవసరం లేదు. జామ గింజలు గట్టిగా ఉండటం వల్ల అవి కడుపులోకి వెళ్లిన తర్వాత పూర్తిగా జీర్ణం కావు. మన జీర్ణవ్యవస్థ జామపండు గుజ్జులోని పోషకాలను గ్రహించుకుంటుంది కానీ, గింజల పైపొరను పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదు. ఆ తర్వాత ఆ గింజలు చిన్న పేగు, పెద్ద పేగుల గుండా ప్రయాణించి, చివరికి మలం ద్వారా సహజంగానే శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి.

గింజల వల్ల పోషకాలు అందుతాయా?

జామ గింజలలో కొంతమేర ఫైబర్, ఇతర మొక్కల పోషకాలు ఉంటాయి. పండును గింజలతో సహా తినడం వల్ల అవి కూడా మన ఆహారంలో భాగమవుతాయి. అయితే, కేవలం గింజలను విడిగా తినడం వల్ల ప్రత్యేకంగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. జామపండులోని పూర్తి పోషకాలు అందాలంటే పండు మొత్తాన్ని తినడమే మంచిది.

అతిగా తింటే సమస్యలు తప్పవు

మితంగా జామకాయలు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఒకేసారి అధికంగా జామకాయలు, గింజలు తింటే కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సంబంధిత అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు జామకాయలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

కడుపులో చెట్టు మొలుస్తుందా?

చిన్నప్పటి నుండి వినే గింజలు మింగితే కడుపులో చెట్టు పెరుగుతుంది అనే మాటలో ఏమాత్రం నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. మన కడుపులోని జీర్ణవ్యవస్థ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తడం అసాధ్యం. పొరపాటున జామ గింజలను మింగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు, అవి శరీరానికి ఎలాంటి హాని చేయకుండానే బయటకు వెళ్లిపోతాయి. కాకపోతే ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

Follow Us