AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం, ఈ 3 నైవేద్యాల వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Prabodhini/Dev Uthani Ekadashi 2026 Significance Telugu: నవంబర్ 20న దేవుతాని ఏకాదశిని జరుపుకోనున్నారు. ఈ రోజున చెరకుతో మండపం ఎందుకు ఏర్పాటు చేస్తారు? సింగాడా, చిలగడదుంప, ఉసిరి, రేగి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సంప్రదాయ ప్రాధాన్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం, ఈ 3 నైవేద్యాల వెనుక ఉన్న రహస్యం తెలుసా?
Prabodhini/Dev Uthani Ekadashi 2026 Significance Telugu
Rajashekher G
|

Updated on: Nov 15, 2026 | 5:12 PM

Share

Dev Uthani Ekadashi 2026 Significance Telugu: హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని.. దేవఉత్థాన ఏకాదశి / ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ రోజున మేల్కొంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పర్వదినం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుడతారు. 2026లో ని నవంబర్ 20న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.

2026 శుభ సమయాలు

2026 నవంబర్ 20న ఉదయం 7:15 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, నవంబర్ 21న ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. స్మార్త, గృహస్త సంప్రదాయం ప్రకారం నవంబర్ 20న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. నవంబర్ 21న మధ్యాహ్నం 1:11 నుంచి 3:18 గంటల మధ్య పారణ చేయాలని పేర్కొంటారు. హరివాసర ముగింపు సమయం మధ్యాహ్నం 12:07 గంటలుగా ఉంటుంది.

చెరకుతో మండపం ఎందుకు ఏర్పాటు చేస్తారు?

ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన శాలిగ్రామ స్వామి, తులసీదేవి వివాహాన్ని నిర్వహించడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంది. ఈ తులసీ వివాహం కోసం చెరకుతో మండపాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక సంప్రదాయంగా భావిస్తారు. చెరకు సహజంగా తియ్యగా ఉండటంతో కుటుంబ జీవితంలో మాధుర్యం, సంతోషం, ఐక్యత కలగాలని కోరుకునే సంకేతంగా దీనిని భావిస్తారు. అలాగే చెరకు వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉండటంతో కుటుంబంలో అభివృద్ధి, శ్రేయస్సు, సంతానం వృద్ధి కలగాలని ప్రార్థిస్తారు. అందువల్ల చెరకు మండపం కొత్త ఆరంభాలకు, శుభానికి ప్రతీకగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

సింగాడా, చిలగడదుంప, రేగి పండ్లు ఎందుకు సమర్పిస్తారు?

సమయంలో సీజన్‌కు అనుగుణంగా లభించే సింగాడా (నీటి కాయ), చిలగడదుంప, ఉసిరికాయ, రేగి పండ్లు వంటి వాటిని పూజలో నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. కొత్తగా లభించిన పంటలు, పండ్లను ముందుగా దేవుడికి సమర్పించి, ఆ తర్వాత స్వీకరించడం మన ప్రాచీన సంప్రదాయాల్లో ఒకటిగా భావిస్తారు.

మరోవైపు, కాలానుగుణంగా లభించే ఈ ఆహార పదార్థాలు ఉపవాస సమయంలో కూడా ఉపయోగపడతాయి. సింగాడా, చిలగడదుంప వంటి వాటిని శక్తినిచ్చే ఆహారంగా తీసుకుంటారు. ఉసిరి, రేగి వంటి పండ్లను కూడా కాలానుగుణ ఆహారంలో భాగంగా ఉపయోగిస్తారు. ఈ విధంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం, కొత్త పంటలను సమర్పించడం, ప్రకృతితో అనుబంధాన్ని చాటుకోవడం వంటి భావాలు ఈ సంప్రదాయం వెనుక ఉన్నాయని చెబుతారు. అందుకే కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, భక్తి, ప్రకృతి, కుటుంబ శ్రేయస్సు, కొత్త ఆరంభాలకు ప్రతీకగా భావించబడుతుంది.

(Disclaimer: ఈ కథనంలోని ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, నమ్మకాలు సంప్రదాయాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతం, కుటుంబ ఆచారాలను బట్టి పద్ధతుల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం..
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం..
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం
Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!
Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల
ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో..
అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో..
ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!
ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!
మెగా మూవీలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన పబ్లిక్ స్టార్
మెగా మూవీలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన పబ్లిక్ స్టార్