AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి

టీవీ షోస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తోంది బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి. అలాగే అప్పుడప్పుడు వివాదాస్పద విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాడ్ కాస్ట్ కు హాజరైన అషూరెడ్డి తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Ashu Reddy: అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి
Ashu Reddy
Basha Shek
|

Updated on: Nov 15, 2026 | 5:09 PM

Share

అషూరెడ్డి.. తెలుగు ఆడియెన్స్ కు ఈ అందాల తార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ సమంతగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టింది. యాంకర్ గా తన ట్యాలెంట్ చూపించింది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అషూ రెడ్డి. ఆపై బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్యన కొన్ని తెలుగు సినిమాల్లోనూ కనిపించిన అషూరెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటోంది. అదే సమయంలో వివాదాస్పద విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషూ రెడ్డి మోసం చేసిందని హైదరాబాద్‌‌‌కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందులో నిజనిజాల సంగతి పక్కన పెడితే తాను జీవితంలో అసలే పెళ్లి చేసుకోనంటుంది అషూరెడ్డి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ కు హాజరైన ఆమె తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. థూ అని ఉమ్మేసింది అషూరెడ్డి. ‘ప్రేమ, పెళ్లి అనేవి నా మైండ్‌లోనే కాదు మనసులో కూడా లేవు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే అప్పుడు చూస్తాను’ అని చెప్పుకొచ్చింది అషూరెడ్డి. ఇక డ్రింకింగ్ అలవాటు గురించి మాట్లాడుతూ.. ‘ బ్యాడ్ పీపుల్‌తో ఏదైతే జర్నీ చేశానో అప్పుడు డ్రింకింగ్ అలవాటు ఉండేది. అయితే తాగి నా ఆరోగ్యం పాడుచేసుకోవాలనుకోవట్లేదని కొన్నాళ్లకు నాకు అర్థమైంది. అప్పుడే ఆపేసి రోజూ జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఎందుకంటే మన శరీరమే మనకు దేవాలయం. దాన్ని నువ్వు బాగా చూసుకుంటే అది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. ఈ ఆలోచన రాకముందు వరకు తాగేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

సుప్రిత పాడ్ కాస్ట్ లో అషూరెడ్డి..

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం
Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!
Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల
ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
ద్రవిడ్ రికార్డును దాటేసిన జో రూట్
అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో..
అక్షయ నవమి ఎప్పుడు? ఈ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో..
ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!
ఇలా క్లీన్ చేస్తే బాత్‌రూమ్‌ టైల్స్‌ మిలమిలా మెరవాల్సిందే!
మెగా మూవీలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన పబ్లిక్ స్టార్
మెగా మూవీలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన పబ్లిక్ స్టార్
ఏపీలో దూసుకొస్తున్న మరో తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలే
ఏపీలో దూసుకొస్తున్న మరో తీవ్ర తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలే