అబ్బా..! ఈ ట్రైలర్ ఏంటి గురూ ఇలా ఉంది..!! క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి.. ఆ ఒక్క తప్పుతో అంతా కొలాప్స్
ఓటీటీలో చాలా రకాల సినిమాలు వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక వారం వారాం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆడియన్స్ ముందుకురానుంది. ఇందుకు సంబందించిన ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది.

క్రికెటర్ కావాలనే ఒక యువతి కల.. అనూహ్య పరిస్థితుల వల్ల ఆమె జీవితంలో తలెత్తిన పెను మార్పుల నేపథ్యంలో రూపొందిన సరికొత్త యూత్‌ఫుల్, ఎమోషనల్ వెబ్ సిరీస్ ‘తీన్ తిగాడ’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా నవంబర్ 20 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. యూవత కలలు, వారి జీవితాల్లో అనుకోకుండా జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో అస్మాని, మానస్ లవర్స్‌గా కనిపిస్తారు. అస్మాని చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకోగా, మానస్ మ్యూజిక్ రంగంలో రాణించాలని కలలు కంటుంటాడు. అయితే, ఒక రాత్రి వీరిద్దరూ అనుకోకుండా ఫిజికల్‌గా దగ్గరవుతారు. ఈ సంఘటన కారణంగా అస్మానికి ప్రెగ్నెన్సీ వస్తుంది.
ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి
కెరీర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో, సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా పేరెంట్‌హుడ్ (తల్లిదండ్రులయ్యే) బాధ్యతలు వారిపై పడతాయి. ఈ క్లిష్టమైన పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారు? ప్రేమ, కుటుంబం, కెరీర్ అనే మూడు భిన్నమైన మార్గాల మధ్య వారి ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ సిరీస్ అసలు కథ. విడుదలైన ‘తీన్ తిగాడ’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యూత్‌కు సులభంగా కనెక్ట్ అయ్యేలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను ఇందులో అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు.
ఆ హీరోయిన్ డాన్స్ కోసం చాలా కష్టపడింది.. ప్రతిరోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేది: మంజు భార్గవి
కలలు కనే వయసులో అనూహ్యమైన బాధ్యతలు మీదపడితే వచ్చే మానసిక సంఘర్షణను ఎంతో సహజంగా చూపించారు. ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ యువతను కట్టిపడేసేలా ఉన్నాయి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, అందులో ఉన్న పెయిన్, స్ట్రగుల్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే తాన్యా భరద్వాజ్, ఈషా నారాయణ్ సింగ్, దివ్యాంశు బిష్ట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజీవ్ రాజ్ ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించారు. ఈ సిరీస్ పూర్తిగా హిందీ భాషలో అందుబాటులో ఉంటుంది. యూత్‌ఫుల్ కంటెంట్, బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. నవంబర్ 20 నుంచి జీ5 ఓటీటీలో దీన్నిచూడొచ్చు.
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఆయన సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




