Viral News: స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచి.. ఓపెన్ చేయగా..
ఓ వ్యక్తి కొత్తగా ఇళ్లు కొన్నాడు.. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించుకోవాలి అనుకున్నాడు. ఇక వెంటనే ఇంటి వెనక బాగంలో ఉన్న తోటలో స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు ప్రారంభించారు. అయితే తవ్వకాలు జరుపుతుండగా అతని ఊహించని విధంగా ఐదు బంగారు కడ్డీలతో పాటు, భారీగా బంగారు నాణేలు కనిపించాయి. ప్రాన్స్‌లో జరిగిన ఈ సంగఘటనకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇంట్లో కొత్తగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా సుమారు రూ.7కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు, నాణేలు బయటపడిన సంఘటన ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం ఓ వ్యక్తి న్యూవిల్లే-సుర్-సాన్ పట్టణంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే తాజాగా ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలి అనుకున్నాడు. ఇందుకోసం ఇంటి వెనకాల ఉన్న తోటలో తవ్వకాలు స్టార్ట్ చేయించాడు.
కొద్ది దూరం తవ్విన తర్వాత వాళ్లకు భూమిలో పాతిపెట్టిన కొన్ని ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. అవేంటని బయటకు తీసి ఓపెన్ చేయగా వాళ్లు ఊహించని సీన్ కనిపించింది. ఆ సంచిలో ఐదు బంగారు కడ్డీలతో పాటు వందల కొద్ది బంగారు నాణేలు కనిపించాయి. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా వెంటనే ఆ ఇంటి యజమాని స్థానికంగా ఉన్న మున్సిపల్ అధికారులకు తెలిపాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 7లక్షల యూరోలు ఉండొచ్చని అంచనా వేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు 7 కోట్లు!
బంగారం ఎవరిది? అధికారుల విచారణ
అయితే మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని పరావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ బంగారం ఎదైనా నిధిని చెందిందా.. అందులో ఉన్నవి ఏవైనా చారిత్రక విలువ కలిగిన వస్తువులా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ అందులో పురావస్తు ప్రధాన్యత కలిగిన వస్తువులు ఉంటే.. దానిపై పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ వాటిపై ఎలాంటి పురావస్తు ఆధారాలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఆ నిధి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
