AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. రెండు ప్రావిన్సుల్లో ఏకకాలంలో ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏకంగా 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్లలో నలుగురు పాకిస్థాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మేజర్ స్థాయి అధికారి ఉండటం గమనార్హం. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సుల్లో ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను పాకిస్థాన్ సైన్యం బయటపెట్టింది.

ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!
Pakistan Army Says 28 Killed In Khyber Pakhtunkhwa And Balochistan
Sharada V
|

Updated on: Nov 15, 2026 | 5:44 PM

Share

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. రెండు ప్రావిన్సుల్లో ఏకకాలంలో ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏకంగా 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్లలో నలుగురు పాకిస్థాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మేజర్ స్థాయి అధికారి ఉండటం గమనార్హం. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సుల్లో ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను పాకిస్థాన్ సైన్యం బయటపెట్టింది.

బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులపై మెరుపుదాడులు

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు శుక్రవారం నుంచి వరుస ఆపరేషన్లు ప్రారంభించాయి. కోల్‌పూర్, కర్దగాప్, నుష్కీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. కోల్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. హతమైన వారిలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా ఉన్నాడు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.

ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు కూడా సైన్యంపై ఎదురుదాడికి దిగారు. సాధారణ డ్రోన్లు కాకుండా ఆయుధాలు అమర్చిన క్వాడ్‌కాప్టర్లను ఉపయోగించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనిక వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన మేజర్ ఒమర్ మిన్హాస్ నాసిర్, హవల్దార్ మహమ్మద్ అద్నాన్ ఖాన్ ప్రాణాలు కోల్పోయారు.

ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోనూ భారీ ఎన్‌కౌంటర్

మరోవైపు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగించాయి. మీర్ అలీ, దత్తా ఖేల్, అలీ ఖేల్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టాయి. భీకర ఎదురుకాల్పుల్లో 16 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం ఐఎస్పీఆర్ (ISPR) ప్రకటించింది. అలీ ఖేల్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో 12 మంది ఉగ్రవాదులు మరణించగా.. మీర్ అలీ, దత్తా ఖేల్ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు హతమయ్యారు. ఈ ఆపరేషన్లలో హవల్దార్ అస్మత్ అలీ, నాయక్ అఫ్తాబ్ అలీ అనే మరో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో వారు ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని సైన్యం పేర్కొంది.

భారత్‌పై పాకిస్థాన్ ఆరోపణలు

ఈ రెండు ప్రావిన్సుల్లో జరిగిన ఆపరేషన్లలో మొత్తం 24 మంది ఉగ్రవాదులు హతమవగా నలుగురు సైనికులు మరణించారు. హతమైన ఉగ్రవాదులు గతంలోనూ అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని, పౌరుల హత్యల్లోనూ పాల్గొన్నారని పాకిస్థాన్ సైన్యం ఆరోపించింది. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.

బలూచిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ గతంలోనే ‘ఫిత్నా అల్ హిందుస్తాన్’ అనే పదాన్ని ఉపయోగించింది. ఈ సంస్థలు భారత్ ప్రోద్బలంతోనే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది.

పాకిస్థాన్ చేస్తున్న ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మతపరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ అధికారికంగా తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టింది.

Follow Us
ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!
ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!
బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..!
బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..!
కలలో చనిపోయిన వారు తిరిగి బ్రతికొచ్చినట్లు కనిపిస్తున్నారా?
కలలో చనిపోయిన వారు తిరిగి బ్రతికొచ్చినట్లు కనిపిస్తున్నారా?
శీతాకాలంలో ఇవి రోజూ గుప్పెడు తింటే చాలు.. వణికించే చలిలో కూడా
శీతాకాలంలో ఇవి రోజూ గుప్పెడు తింటే చాలు.. వణికించే చలిలో కూడా
జామకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
జామకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..?
మ్యాచ్ ఆడకపోయినా సిరీస్ హీరోగా గుర్నూర్
మ్యాచ్ ఆడకపోయినా సిరీస్ హీరోగా గుర్నూర్
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం..
విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ప్రబోధిని ఏకాదశి.. చెరకు మండపం..
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
అందుకే తాగడం మానేశా.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అషూరెడ్డి
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
ఆధార్ కార్డులో ఈ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటిలోగా
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం
: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం