AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో పింఛన్లు పొందుతున్నవారికి అదిరిపోయే న్యూస్.. రూ.4 వేలకు పెంపు..! ప్రభుత్వం బిగ్ అప్డేట్..

ప్రస్తుతం కొత్త పించన్లు మంజూరు చేసి వారికి నగదు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పించన్ల పెంపుపై కూడా సన్నాహాలు చేస్తోంది. పించన్లను రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఇప్పటివరకు అమలు చేయలేదు. త్వరలో పించన్ల పెంపుపై కూడా సమాలోచనలు చేస్తోంది.

Telangana: తెలంగాణలో పింఛన్లు పొందుతున్నవారికి అదిరిపోయే న్యూస్.. రూ.4 వేలకు పెంపు..! ప్రభుత్వం బిగ్ అప్డేట్..
Pension Telangana
Venkatrao Lella
|

Updated on: Nov 15, 2026 | 5:54 PM

Share

తెలంగాణలో చేయూత పథకం ద్వారా లక్షలాది మంది సామాజిక పించన్లను పొందుతున్నారు. వృద్దులు, దిగ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర కేటగిరీల్లో లక్షలాది మంది ప్రతీ నెలా పించన్లు పొందుతున్నారు. ఇటీవల కొత్త పించన్లకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. ప్రస్తుతం కొత్తగా పించన్లు మంజూరైన వారికి కూడా నగదు అందిస్తున్నారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే పించన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపర్చారు. అధికారంలోకి వచ్చి చాలా రోజులైన ఇంకా ప్రభుత్వం పించన్లను పెంచలేదు. దీంతో పించన్లు ఎప్పుడు పెంచుతారోనని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నల్గొండలోని ఏచూరి గార్డెన్స్‌లో నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతర ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, గతంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామంటూ చెప్పుకొచ్చారు.  ఈ సందర్భంగా గత ఎన్నికల హామీలలో ఒకటైన పెన్షన్ల పెంపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్షన్‌ను త్వరలోనే రూ. 4 వేలకు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తమ ప్రభుత్వం పాటిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ.. పించన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 95 వేల కోట్ల రూపాయలు నిధులను అసలు కింద కట్టిందని మంత్రి వివరించారు. ఈ ఆర్థిక భారాల మధ్య కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, దీనికి రూ. 13 వేల కోట్ల రూపాయలు చెల్లించి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు టికెట్ లేకుండా మూడేళ్లుగా ప్రయాణిస్తున్నారన్నారు. పేదల ఆకలి తీర్చడానికి మార్కెట్లో కిలో రూ. 77 విలువ చేసే సన్నబియ్యాన్ని ఉచితంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. దీనితో పేదవాడు కూడా రెండు పూటలా కడుపు నిండా అన్నం తిని పడుకుంటున్నాడని అన్నారు.

గతంలో ఇచ్చిన బియ్యం పశువుల దాణాకు సరిపోయేదని, ఇప్పుడు తాము నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు అందిస్తామని, ఎవరూ ఊహించని విధంగా రూ.5 లక్షల ఆర్ధిక సాయం ఇళ్లను నిర్మించేందుకు అందిస్తున్నామని చెప్పారు.

Follow Us