AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గించే లడ్డూలు.. రోజూ తింటే ఫుల్ ఎనర్జీ.. ఇంట్లోనే ఇలా చేసుకోండి..

చలికాలం మొదలైందంటే చాలు, చాలామందికి ఏ పని చేయాలన్నా నీరసం, ఒళ్లు నొప్పులు, అలసట ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన టానిక్‌ల కంటే మన వంటింట్లో దొరికే పదార్థాలతో చేసే అవిసె గింజల లడ్డూ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అవిసె గింజలతో లడ్డూలు చేస్తే చేదు వస్తాయనో, గట్టిపడిపోతాయనో చాలామంది వెనుకాడుతుంటారు. కానీ ఈ రెండు చిన్న రహస్య చిట్కాలు పాటిస్తే, అస్సలు చేదు లేకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని లడ్డూలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.

నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గించే లడ్డూలు.. రోజూ తింటే ఫుల్ ఎనర్జీ.. ఇంట్లోనే ఇలా చేసుకోండి..
Winter Special Flaxseed Laddu RecipeImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Nov 15, 2026 | 6:24 PM

Share

చలికాలం మొదలైందంటే చాలు.. శరీరంలో నీరసం, అలసట, కీళ్ల నొప్పులు వేధించడం సర్వసాధారణం. ఈ సీజన్‌లో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని పెంచడానికి మన పెద్దలు సూచించిన సాంప్రదాయ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మీరు తరచుగా బలహీనంగా, నీరసంగా ఫీలవుతుంటే.. ఈ చలికాలంలో అవిసె గింజలు, బెల్లం, గోధుమ పిండితో ఇంట్లోనే ఎంతో రుచికరమైన, పోషకమైన లడ్డూలను తయారు చేసుకోండి. సూపర్‌ఫుడ్‌గా పిలువబడే అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నీరసాన్ని తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మరి చేదు లేకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ అవిసె గింజల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • అవిసె గింజలు – సుమారు 1 కప్పు
  • గోధుమ పిండి: 2 కప్పులు
  • బెల్లం: 1.5 కప్పులు
  • స్వచ్ఛమైన దేశీ నెయ్యి: 1 కప్పు
  • డ్రైఫ్రూట్స్: 1 కప్పు
  • శొంఠి: 1 టీస్పూన్
  • యాలకుల పొడి: 1 టీస్పూన్

లడ్డూలు రుచిగా రావడానికి రహస్య చిట్కాలు

చేదు రాకుండా: అవిసె గింజలను తక్కువ మంట మీద, వాటి నుండి కమ్మటి సువాసన వచ్చి చిటపటలాడే వరకు మాత్రమే వేయించాలి. ఎక్కువగా వేయిస్తే గింజలు మాడిపోయి చేదు వస్తాయి.

గట్టిపడకుండా: లడ్డూల కోసం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. కేవలం నెయ్యిలో బెల్లాన్ని కరిగించి మంట ఆర్పేయాలి. దీనివల్ల లడ్డూలు గట్టిపడకుండా ఎంతో మృదువుగా ఉంటాయి.

తయారీ విధానం

అవిసె గింజల పొడి: ముందుగా ఒక పొడి బాణలిలో అవిసె గింజలను మధ్యస్థ మంట మీద 3-4 నిమిషాల పాటు వేయించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా కరకరలాడేలా పొడి చేసుకోవాలి.

డ్రైఫ్రూట్స్ – గోంద్ వేయించడం: బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, తరిగిన బాదం, జీడిపప్పు, తామర గింజలు, గోంద్ (జిగురు) వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేగిన జిగురును చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

గోధుమ పిండి వేయించడం: అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి, గోధుమ పిండిని వేయాలి. పిండి బంగారు రంగులోకి మారి, కమ్మటి సువాసన వచ్చే వరకు తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.

బెల్లం కరిగించడం: మరో పాత్రలో తురిమిన బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు తక్కువ మంట మీద ఉడికించి, ఒక పొంగు రాగానే మంట ఆపేయాలి.

మిశ్రమాన్ని కలపడం: ఒక పెద్ద వెడల్పాటి పళ్లెంలో వేయించిన గోధుమ పిండి, అవిసె గింజల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, గోంద్ పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో కరిగించిన బెల్లం మరియు మిగిలిన గోరువెచ్చని నెయ్యిని పోసి అంతా కలిసేలా మిక్స్ చేయాలి.

లడ్డూలు చుట్టడం: మిశ్రమం కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి.

ఎలా తినాలి?

పూర్తిగా చల్లారిన తర్వాత ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో పాటు ఒక్క లడ్డూ తింటే.. చలికాలం మొత్తం నీరసం దరిచేరదు, శరీరం ఉక్కులా బలంగా మారుతుంది.

Follow Us
నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గించే లడ్డూలు.. రోజూ తింటే ఫుల్ ఎనర్జీ
నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గించే లడ్డూలు.. రోజూ తింటే ఫుల్ ఎనర్జీ
మొబైల్‌లోనే రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. చాలా సింపుల్
మొబైల్‌లోనే రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. చాలా సింపుల్
'నువ్వు చనిపోతేనే మాకు ప్రశాంతత'.. భారత సంతతి అధికారిపై ఆగ్రహం
'నువ్వు చనిపోతేనే మాకు ప్రశాంతత'.. భారత సంతతి అధికారిపై ఆగ్రహం
తిరుమల శ్రీవారికి రోజూ 45 రకాల నైవేద్యాలు.. పులిహోర నుంచి..
తిరుమల శ్రీవారికి రోజూ 45 రకాల నైవేద్యాలు.. పులిహోర నుంచి..
ఆ గదిలో ఏం జరిగింది? OTTలో రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్..
ఆ గదిలో ఏం జరిగింది? OTTలో రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్..
స్విమ్మింగ్ పూల్‌ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచి
స్విమ్మింగ్ పూల్‌ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచి
బ్యాటర్లది కాదు.. బౌలర్లదే ఈ సిరీస్ అంటూ శ్రేయస్ కితాబు
బ్యాటర్లది కాదు.. బౌలర్లదే ఈ సిరీస్ అంటూ శ్రేయస్ కితాబు
తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు..! ప్రభుత్వం అప్డేట్..
తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు..! ప్రభుత్వం అప్డేట్..
ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!
ఉగ్ర స్థావరాలపై పాక్ సైన్యం మెరుపుదాడులు.. 24 మంది హతం!
బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..!
బంగారం ధర ఢమాల్..? తులం అంత తక్కువకు పడిపోతుందా..!