Yadamma Raju: గ్రాండ్‌గా కమెడియన్‌ యాదమ్మ రాజు వివాహం.. సందడి చేసిన నాగబాబు, పూరి ఆకాశ్‌

స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు. తాను మొదట ఫ్రెండ్‌గా పరిచయమైందని, ఆ తర్వాత ప్రేయసిగా మారిందని పలు టీవీషోల్లోనూ ఓపెన్‌గా మాట్లాడాడు. ఇక స్టెల్లా కూడా యాదమ్మరాజు పేరును పచ్చబొట్టు వేయించుకుంది.

Yadamma Raju: గ్రాండ్‌గా కమెడియన్‌ యాదమ్మ రాజు వివాహం.. సందడి చేసిన నాగబాబు, పూరి ఆకాశ్‌
Yadamma Raju Marriage
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2022 | 4:50 PM

ప్రముఖ కమెడియన్‌ యాదమ్మ రాజు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు స్టెల్లాతో కలిసి ఏడడుగులు నడిచాడు. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు సినిమా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మెగాబ్రదర్‌ నాగబాబు, హీరో ఆకాశ్‌పూరి, హైపర్‌ ఆది, అశ్విన్‌ , యాంకర్‌ ప్రదీప్‌, బిగ్‌బాస్‌ సొహైల్‌, వెంకీ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా స్టెల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు. తాను మొదట ఫ్రెండ్‌గా పరిచయమైందని, ఆ తర్వాత ప్రేయసిగా మారిందని పలు టీవీషోల్లోనూ ఓపెన్‌గా మాట్లాడాడు. ఇక స్టెల్లా కూడా యాదమ్మరాజు పేరును పచ్చబొట్టు వేయించుకుంది. ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ ప్రేమపక్షుల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లిపీటలెక్కి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు. ఇదిలా ఉంటే కమెడియన్ యాదమ్మ రాజు పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

సినిమాల్లోనూ..

పటాస్‌ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మరాజు. మొదట స్టూడెంట్ గా ఈ షోలో అడుగుపెట్టిన అతను తన కామెడీ పంచులతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే పటాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఆతర్వాత అదిరింది లాంటి పలు కామెడీ షోలు చేస్తూ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. గువ్వ గోరింక, జార్జిరెడ్డి, హలో గురూ ప్రేమ కోసమే, విద్యార్థి తదితర సినిమాల్లో హీరో ఫ్రెండ్‌గా యాదమ్మ రాజు నటించాడు.

Yadamma Raju Marriage 1

ఇవి కూడా చదవండి

Yadamma Raju Marriage 2

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్  చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు