Tollywood: ఎర్ర మందారమే అమ్మాయిగా మారిందా ?.. ఈ వయ్యారి కళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కొందరు హీరోయిన్స్ క్రేజీ పిక్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ తరహాలోనే ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు అభిమానులకు మధ్య వారధిగా మారింది. తమ ఫేవరేట్ తారల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండగా.. తమ సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటున్నారు స్టార్స్. లైవ్స్, ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ నేరుగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అలాగే తమకు సంబంధించిన అరుదైన ఫోటోలను.. బాల్యం తాలుకూ జ్ఞాపకాలను నెట్టింట షేర్ చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కొందరు హీరోయిన్స్ క్రేజీ పిక్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ తరహాలోనే ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో చక్కర్లు కొడుతుంది.
పైన ఫోటోను చూశారు కదా.. ఎర్ర మందారమే బాపు బొమ్మగా మారిందా ? అన్నట్లుగా ఉంది కదా. ఈ ముద్దుగుమ్మ కళ్లకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. ఇక పెళ్ళి, పిల్లల తర్వాత ఇటీవలే కథానాయికగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటుంది.
ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. రామ్ చరణ్ సరసన నటించిన మగధీర సినిమాతో కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆర్య 2, సర్దార్ గబ్బర్ సింగ్, బిజినెస్ మెన్, డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తన స్నే హితుడు గౌతమ్ కిచ్లూను 2020లో వివాహం చేసుకుంది. వీరికి ఈ ఏడాది ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ జన్మించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.