25 ఏళ్లకే ట్రిపుల్‌ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్‌.. ఒక్క ఛాన్స్‌ అంటూ దీనంగా వేడుకుంటోన్న టీమిండియా క్రికెటర్‌

అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించడమంటే మాములు విషయం కాదు. ఎంతో ఓపిక, సహనం ఉంటే కానీ ఈ స్కోరు చేయడం సాధ్యం కాదు. అందుకే ఇంటర్నేషనల్‌ టెస్ట్‌ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వాళ్లను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు.

25 ఏళ్లకే ట్రిపుల్‌ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్‌.. ఒక్క ఛాన్స్‌ అంటూ దీనంగా వేడుకుంటోన్న టీమిండియా క్రికెటర్‌
Karun Nair
Follow us

|

Updated on: Dec 11, 2022 | 8:48 PM

అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించడమంటే మాములు విషయం కాదు. ఎంతో ఓపిక, సహనం ఉంటే కానీ ఈ స్కోరు చేయడం సాధ్యం కాదు. అందుకే ఇంటర్నేషనల్‌ టెస్ట్‌ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వాళ్లను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. ఇక ఇండియా నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కాగా మరొకరు కరుణ్‌ నాయర్‌. సాధారణంగా ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన క్రికెటర్లు చాలా కాలం పాటు జాతీయ జట్టులో కొనసాగుతారు. అయితే కరుణ్‌ నాయర్‌ మాత్రం దీనికి మినహాయింపు. 31 ఏళ్ల కరుణ్ నాయర్ 25 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అది కూడా అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ తర్వాత కరుణ్‌ కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కరుణ్‌ నాయర్‌ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌ ఐదో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టుపై నాయర్‌ అద్భుతంగా ఆడి ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 32 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 303 పరుగులు చేశాడు. కరుణ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌తో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక టీమిండియా ప్లేయర్ గా కరుణ్‌ నాయర్‌ నిలిచాడు.

రంజీలోనూ చుక్కెదురు..

ఈ ట్రిపుల్ సెంచరీ తర్వాత టీమ్ ఇండియా టెస్టు జట్టులో శాశ్వత సభ్యుడిగా మారే అవకాశం ఉన్న కరుణ్, మార్చి 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుస వైఫల్యాలతో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో స్థానం దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఫెయిల్‌ అయ్యాడు. తనకు దక్కిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక వన్డే జట్టు నుంచి కూడా నిష్క్రమించాడు నాయర్‌. ఇలా అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. నాయర్‌ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా టీమిండియా జెర్సీ ధరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న కరుణ్‌ నాయర్‌కు కర్ణాటక జట్టు కూడా హ్యాండ్ ఇచ్చింది. త్వరలో జరగనున్న రంజీట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్‌ బోర్డు.. అతనికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్‌ నాయర్‌ చేసిన ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను కదిలిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌..

‘డియర్ క్రికెట్.. నాకు మరో అవకాశం ఇవ్వండి’ అని కరణ్‌ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన మాజీ క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అతనికి ధైర్యం చెబుతున్నాడు. ‘కరుణ్‌.. నువ్వు ట్యాలెంటెడ్ బ్యాటర్‌వి. బలంగా ఉండు. త్వరలోనే జట్టులోకి తిరిగివస్తావు’ అంటూ వెన్ను తట్టి ధైర్యం చెబుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..