AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Captain: బంగ్లాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ కెప్టెన్ కాదట.. సారథ్య బాధ్యతలను బీసీసీఐ ఎవరికి అప్పగించిందంటే..

డిసెంబర్ 4 నుంచి బంగ్లా పర్యటనలో ఉన్న భారత్ వన్డే సిరీస్‌ను ముగించుకుని టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతుంది. బుధవారం(డిసెంబర్‌ 14) నుంచి బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. అయితే ఈ సిరీస్‌కు.. రోహిత్ స్థానంలో..

Test Captain: బంగ్లాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ కెప్టెన్ కాదట.. సారథ్య బాధ్యతలను బీసీసీఐ ఎవరికి అప్పగించిందంటే..
Kl Rahul
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 9:37 PM

Share

డిసెంబర్ 4 నుంచి బంగ్లా పర్యటనలో ఉన్న భారత్ వన్డే సిరీస్‌ను ముగించుకుని టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతుంది. బుధవారం(డిసెంబర్‌ 14) నుంచి బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ గాయం కారణంగా దూరమవడంతో సారథ్య బాధ్యతలను మరో ఆటగాడికి అప్పగిస్తూ బీసీసీఐ ప్రకటించింది. అయితే సారథ్యంతో పాటు స్వల్ప మార్పులను కూడా బీసీసీఐ చేసింది. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన చేసింది.

‘‘బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో మార్పులు. సిరీస్ మొదటి మ్యాచ్‌లో రోహిత్‌కు బదులుగా కెఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు. ఇంకా రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి వస్తాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో మొహమ్మద్ షమీ, జడేజాలకు బదులుగా నవదీస్ సైనీ, సౌరభ్ కుమార్‌లను స్వ్కాడ్‌లోకి తీసుకున్నాం’’ అని బీసీసీఐ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కెరీర్‌లో ఒకే ఒక్క టెస్టు (2010లో సౌతాఫ్రికా) ఆడిన ఫాస్ట్‌బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌కు కూడా ఈ సిరీస్‌కు కోసం భారత సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా, టెస్ట్ సిరీస్‌కు ముందు ఆడిన వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ మినహా మొదటి రెండు వన్డేలలోనూ భారత ఆటగాళ్లు అభిమానులను నిరాశపరిచారు. ఫలితంగా భారత్‌పై బంగ్లా 02 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. అయితే సిరీస్ పోయినా అభిమానులను సంతోషపెట్టే విధంగా మూడో మ్యాచ్‌లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయగా(210).. మాజీ కెప్టెన్ కోహ్లీ కూడా సెంచరీ చేసి తన కెరీర్‌లో 72వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

భారత జట్టు..:

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్‌ పూజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, నవ్‌దీప్‌ సైని, సౌరభ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..