AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali: అమెరికా అబ్బాయితో అంజలి పెళ్లంటూ వార్తలు.. మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అంజలి పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Anjali: అమెరికా అబ్బాయితో అంజలి పెళ్లంటూ వార్తలు.. మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..
Anjali
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2022 | 4:38 PM

Share

షాపింగ్ మాల్ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ అంజలి. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా వెంకటేష్, మహాష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో సీతగా..మనింట్లో అమ్మాయిలా కనిపించి తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత బలుపు, సింగం 2, గీతాంజలి, సరైనోడు, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఇటీవల నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అయితే వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అంజలి పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఆమె భర్త అమెరికాలో ఉంటున్నాడంటూ వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు అంజలి. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. “ఇప్పటికే నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. నేను అమెరికాలోని బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయినట్లు కూడా రాశారు. కానీ అదంతా అబద్ధం. ఇప్పటికైతే నాకు పె ళ్లి చేసుకునే ఆలోచన లేదు. కానీ రాబోవు రోజుల్లో తప్పకుండా వివాహం చేసుకుంటాను. ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెప్తాను.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అంజలి సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ లతోనూ బిజీగా గడిపేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ఆర్సీ 15 చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ