TTD: శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్‌ ఉంటుందో.. స్వామివారి లడ్డూలకు కూడా అంతే డిమాండ్‌ ఉంటుంది. ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లిన భక్తులందరూ వీలైనన్ని ఎక్కువగా లడ్డూలు తెచ్చుకోవాలనుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు.

TTD: శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్.. టీటీడీ కీలక ప్రకటన
Tirumala Laddu
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2022 | 8:32 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్‌ ఉంటుందో.. స్వామివారి లడ్డూలకు కూడా అంతే డిమాండ్‌ ఉంటుంది. ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లిన భక్తులందరూ వీలైనన్ని ఎక్కువగా లడ్డూలు తెచ్చుకోవాలనుకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. అధిక లడ్డూలు విక్రయిస్తామంటూ, దర్శనంతో సంబంధం లేకుండానే లడ్డూలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అసత్య వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్‌ చేసుకోవచ్చన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పేసింది. శ్రీవారి భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారం మాత్రం అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

కాగా స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసింది టీటీడీ. జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.అలాగే ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను రేపు (మంగళవారం) విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంటాయి. కాగా.. ఈ నెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?