TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (సోమవారం) విడుదల చేయనుంది. జనవరి నెల కోటాకు సంబంధించిన...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Ttd
Follow us

|

Updated on: Dec 12, 2022 | 10:46 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ (సోమవారం) విడుదల చేయనుంది. జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోచ్చు. ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను రేపు (మంగళవారం) విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంటాయి. కాగా.. ఈ నెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు విడుదల కానున్నాయి. భ‌క్తులు ఈ విషయాన్ని గుర్తించి.. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది. నకిలీ వెబ్‌సైట్‌లను చూసి మోసపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..